జాతీయ వార్తలు

సిబ్బంది కొరతతో అల్లాడుతున్న సిబిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు, బొగ్గు క్షేత్రాల కేటాయింపులు, బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులు తదితర పెద్ద పెద్ద కుంభకోణాలుసహా వెయ్యికి పైగా కేసులతో సతమతమవుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సిబ్బంది కొతరతో అల్లాడుతోంది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐలో మూడింట ఒక వంతు మేరకు దర్యాప్తు, పర్యవేక్షణాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు కారణం. సిబిఐలో దర్యాప్తు బాధ్యతలను నిర్వర్తించే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) ర్యాంకు అధికారుల పోస్టుల్లో మొత్తం 119 మందిని నియమించాల్సి ఉండగా, 45 పోస్టులు, అలాగే 43 మంది డిఐజి స్థాయి పర్యవేక్షణాధికారుల పోస్టులకు గాను 17 పోస్టులు, అదనపు ఎస్‌పి స్థాయిలో 91 పోస్టులకు గాను 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా వివిధ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టుల్లో వాదనలు వినిపించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత కూడా సిబిఐని తీవ్రంగా వేధిస్తోంది. సిబిఐకి మొత్తం 210 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులు మంజూరవగా, ప్రస్తుతం 73 మంది మాత్రమే న్యాయవాదులు ఉన్నారు. అలాగే సిబిఐలోని వివిధ స్థాయిల్లో మొత్తం 370 న్యాయాధికారుల పోస్టులకుగాను 173 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం సిబిఐ వద్ద గత ఏడాది చివరి నాటికి 1,126 కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాల నుంచి గత మూడేళ్లలో 908 కేసులను అందుకున్న సిబిఐ గత ఏడాది నవంబర్ 30వ తేదీ నాటికి 978 కేసులు నమోదు చేసింది.