అంతర్జాతీయం

దూసుకొస్తున్న మరో గ్రహశకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 9: భూగోళాన్ని మరో గ్రహశకలం అతి సమీపంగా దాటబోతోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. మార్చి 5న అత్యంత వేగంగా టిఎక్స్-68 అనే ఈ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్లబోతోందని ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ చూసే అవకాశం ఉందని కూడా నాసా తెలిపింది. దాదాపు 30 మీటర్ల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం వచ్చే నెల 5న భూమికి 18వేల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోయే అవకాశం ఉంది. అయితే దీని కక్ష్య అనిశ్చితమేనని ఏ దిశగా దీన్ని చూసే అవకాశం ఉందన్న విషయం ఇప్పుడే నిర్ధారించలేమని నాసా పేర్కొంది. భూమికి సమీపంగా సంచరిస్తున్న గ్రహశకలాలను పరిశోధించే అమెరికా అధ్యయన సంస్థ నిర్వాహకుడు పాల్ షోడాష్ ఈ గ్రహ శకల గమనగతిని లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రోదసీలో అనేక టెలిస్కోపులను ఏర్పాటు చేశామని వీటిలో ఏదో ఒకటి ఈ తాజా గ్రహ శకలాన్ని పసిగట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ టెలిస్కోపులు అందించే అనేక వివరాలు గ్రహశకల అధ్యయనానికి తోడ్పడతాయని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో గ్రహ శకలం భూమిని ఢీకొనే అవకాశం లేదు. అయితే 2017లో ఇదే మాదిరిగా ఈ గ్రహశకలం భూమికి సమీపంగా వెళ్తుందని అప్పుడు పుడమిని ఢీకొనే అవకాశం 250 మిలియన్‌లో ఒక శాతం ఉంటుందని వెల్లడించారు. 230 టిఎక్స్-68 అనే ఈ గ్రహశకలాన్ని 2013 అక్టోబర్‌లో రాత్రిపూట నాసా గుర్తించింది. అప్పుడు కూడా ఇది భూమిని సమీపిస్తున్న దృశ్యాన్ని గమనించగలింది. మూడు రోజులపాటు దాన్ని పరిశీలించిన తరువాత అది పూర్తిగా అంతర్ధానం అయిపోయిందని, గగనతల వెలుగుల్లోకి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి దీన్ని పరిశీలించడమే సాధ్యం కాలేదని తెలిపారు.
ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే దాని ప్రభావం కొనే్నళ్ల క్రితం రష్యాలోని చెలియాబిన్సిక్‌లో జరిగిన విస్పోటనం కంటే రెండు రెట్లు ఎక్కువగానే ఉంటుందని తెలిపారు.
chitram..
గ్రహశకలం
ఊహాచిత్రం