అంతర్జాతీయం

‘గ్రేట్ ఎట్రాక్టర్’ మిస్టరీ వీడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 10: అంతరిక్ష పరిశోధనల్లో ఎప్పటికప్పుడు ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మిస్టరీలు వెలుగుచూస్తునే ఉంటాయి. తాజాగా ఖగోళవేత్తలు జరిపిన పరిశోధనల్లో వందలాది నక్షత్ర మండలాలు వెలుగుచూశాయి. ఇవన్నీకూడా మన పాలపుంత వెనుక భాగంలోనే భూమికి కేవలం 250 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్నాయని పరిశోధకులు నిగ్గుతేల్చారు. ఇప్పటివరకూ వీటి గురించి కనీస పక్షంగా సంకేతాలు అందకపోవడంతో ఈ తాజా ఆవిష్కరణ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ముఖ్యంగా గురుత్వాకర్షక శక్తికి సంబంధించి ఇప్పటివరకూ మిస్టరీలే కొనసాగుతున్న అంశాలపై దృష్టి సారించడానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు. మన పాలపుంతను వందల వేల గెలాక్సీలను తన వైపు లాక్కొంటున్న ‘గ్రేట్ ఎట్రాక్టర్’ మిస్టరీని ఛేదించడానికి కూడా ఈ పరిశోధన ఫలితాలు ఉపకరిస్తాయని అంటున్నారు. గ్రేట్ ఎట్రాక్టర్‌కు ఉన్న గురుత్వాకర్షక శక్తి 10 లక్షల బిలియన్ల సూర్యుళ్లతో సమానమని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో అత్యంత ఆధునికపై సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పార్కెస్ రేడియో టెలిస్కోప్ ద్వారా మన పాలపుంత వెనుకభాగంలో ఉన్న వందలాది గెలాక్సీల ఉనికిని శాస్తవ్రేత్తలు నిర్ధారించారు. వీటన్నింటినీ కూడా పాలపుంత నక్షత్రాలు ధూళి ద్వారానే పసిగట్టగలిగారు. ఇప్పటివరకూ పాలపుంతల సమాచారమే వెలుగుచూసింది తప్ప దాని వెనుకభాగంలో ఏముంది అన్నది శాస్తవ్రేత్తలకు అంతుబట్టలేదు. తాజాగా వెలుగుచూసిన వాటిలో మొత్తం 883 గెలాక్సీలు ఉన్నాయని వీటిలో మూడింట ఒక వంతు గెలాక్సీలను ఇప్పటివరకూ కనిపెట్టిందే లేదని శాస్తవ్రేత్తల బృందం తెలిపింది. గత నాలుగు దశాబ్దాలుగా గ్రేట్ ఎట్రాక్టర్ గురుత్వాకర్షక శక్తి అంతుబట్టని మిస్టరీగానే కొనసాగుతూ వచ్చిందని పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ స్టావెలీ స్మిత్ వెల్లడించారు. పాలపుంతపై గురుత్వాకర్షణ శక్తి పెరగడం ఏమిటని ఇప్పటివరకూ తమకు తెలియదని, అలాగే ఈ శక్తి ఎక్కడ నుంచి వస్తుందో అంతుబట్టకుంటా ఉందని అన్నారు.