అంతర్జాతీయం

భారత్ అంటే నాకెంతో గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: భారతదేశం వలస దేశంగా ఉండిఉంటేనే బావుండేదంటూ బోర్డ్ సభ్యుడు మార్క్ అండర్‌సన్ చేసిన వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ సంస్థాపకుడు మార్క్ జుకెర్‌బెర్గ్ తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎంతో వేదన కలిగించాయని వాటితో తమ కంపెనీకి, దాని ఆలోచనలకు ఏ రకమైన సంబంధం లేదని ఆయన వెల్లడించారు. ఫ్రీబేసిక్స్‌ను నిషేధిస్తూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయం పట్ల మొదట జుకెర్‌బెర్గ్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో బోర్డు సభ్యుడు అండర్‌సన్ అవధులు దాటి మాట్లాడారు. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వలసవాద వ్యతిరేక ధోరణిగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగడంతో వాటిని వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ వాటి తీవ్రత దృష్ట్యా ఫేస్‌బుక్ అధినేత కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఆయన మాటలతో తనకు ఏరకమైన సంబంధం లేదని భారత దేశం వ్యక్తిగతంగా తనకు ఎంతో ముఖ్యమని అలాగే ఫేస్‌బుక్ సర్వీసులకు సంబంధించి కూడా ఎంతో కీలకమైందని వెల్లడించారు. తాను గతంలో అనేకసార్లు భారత్‌లో పర్యటించానని అక్కడ ప్రజల మానవత్వ ఉన్నత విలువలు ఆధ్మాత్మిక తనను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు. ఆ నేపథ్యంలోనే తన ఆలోచనలకు బలం ఏర్పడిందని ప్రజలందరికీ తన అనుభవాలను పంచుకునే శక్తి ఉంటే సునాయాసంగానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల మధ్య బంధాన్ని అనుబంధాన్ని పెంపొందించడంతోపాటు తమ భవితవ్యాన్ని రూపొందించుకునేందుకు ఫేస్‌బుక్ అవకాశాన్ని అందిస్తోందన్నారు. భవిష్యత్‌ను నిర్మించుకోవాలంటే గతం గురించి అవగాహన ఉండాలన్నారు. భారత్‌లో ఫేస్‌బుక్‌కు విశేషమైన ఆదరణ ఉందని దానికోసమే ఆ దేశ సంస్కృతిని అవగతం చేసుకోగలిగానని పేర్కొన్నారు.