జాతీయ వార్తలు

45 నగరాలకు 37 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర పథకం అమృత్ కింద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 45 నగరాల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 37వేల 58 కోట్లు కేటాయించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్రం అందరికీ ఇళ్లు పథకం కింద మంజూరు చేసిన 4లక్షల 75వేల ఇళ్లలో దాదాపు సగభాగాన్ని తెలుగు రాష్ట్రాలకే కేటాయించినట్టు బుధవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. రెండు రాష్ట్రాలూ ప్రతిపాదనలను సకాలంలో పంపటంతో దాదాపు 2లక్షల ఇళ్ల కేటాయింపులు సాధ్యమయ్యాయన్నారు. అమృత్ పథకం కింద తెలంగాణలో గుర్తించిన 12 నగరాలకు వచ్చే ఐదేళ్లలో 11వేల 36 కోట్లు ఇస్తామని చెబుతూనే, ఈ ఏడాది 415 కోట్లు ఇస్తామన్నారు. మంచినీటి పథకాలకు 405 కోట్లు, ఉద్యానవనాలకు 10కోట్లు కేటాయించామన్నారు. ఆంధ్రలో అమృత్ పథకం కింద 33 నగరాల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 26వేల 22 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ ఏడాదికి 662 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెంకయ్య ప్రకటించారు. ఆంధ్రలో మంచి నీటి పథకాలకు 646 కోట్లు కేటాయించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం కేవలం పథకాలనే నిర్ణయిస్తుందని, వాటి రూపకల్పన, అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలదేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు విధులు, నిధుల నిర్వహణ అప్పగించినట్టు వివరించారు. ఆయా రాష్ట్రాలకు కేటాయించే పథకాలు, వాటికిచ్చే నిధుల వివరాలను ముందే ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు జారీ చేసే మార్గదర్శక సూత్రాలను మాత్రమే తమ శాఖ పరిశీలిస్తోందని వివరించారు. స్థానిక సంస్థల స్వపరిపాలనకు మోదీ ప్రభుత్వం అర్థవంతమైన నిర్వచనమిచ్చి అమలు చేస్తోందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ నగరాలుగా విశాఖ, కాకినాడ ఎంపికవటం మంచి పరిణామన్నారు. వరంగల్ ఎంపిక కొద్దిలో తప్పిపోయిందన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన నగరాలు, మంచి సేవలందించే నగరాలు మాత్రమే ఆకర్షణీయ నగరాలుగా ఎంపికవుతాయన్నారు. దేశంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీతత్వం మొదలైందని, పట్టణ పరిపాలనలో అర్థవంతమైన మార్పు వస్తోందని అభిప్రాయపడ్డారు. 4,041 పట్టణాల్లో గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆయా రాష్ట్రాలు పంపించే పథకాల బాగోగుల ఆధారంగా అమృత్ పథకాన్ని అమలు చేస్తామని వెంకయ్య వివరించారు. నవ భారత నిర్మాణానికి మెరుగైన నగర నిర్మాణమే ప్రాతిపాదికని ఆయన ప్రకటించారు. నగరాలే చోదక యంత్రాలుగా పని చేస్తామన్నారు. స్వచ్చ భారత్ పథకం కూడా ఆశించిన స్థాయిలో పని చేస్తోందని వెంకయ్య స్పష్టం చేశారు.