జాతీయ వార్తలు

ఆ ట్విట్టర్ ఖాతా సయిద్‌ది కాదు ఐఎస్‌ఐదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముంబాయిపై జరిగిన ఉగ్ర దాడికి సూత్రధారి అయిన జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ ట్విట్టర్ ఖాతాను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నిర్వహిస్తున్నట్లు కేంద్ర గూఢచార సంస్థలు గుర్తించాయి. ఇటీవల ‘ఎట్‌దిరేటాఫ్ హఫీజ్ సరుూద్ లైవ్’ పేరుతో ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న హఫీజ్ సరుూద్ ఇటీవల తన ట్విట్టర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం గొడవ, కాశ్మీర్ గొడవను సమర్థించటం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురు ఉరితీతను విమర్శిస్తూ జెఎన్‌యులో నిర్వహించిన సంతాప సభకు హఫీజ్ సరుూద్ తన ట్విట్టర్‌లో మద్దతు ఇచ్చారు. జెఎన్‌యు గొడవకు హఫీజ్ సరుూద్ మద్దతు ఉన్నదని వెల్లడించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొత్త వివాదానికి తెర తీశారు. అయితే హఫీజ్ సరుూద్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నిర్వహిస్తోందని భారత గూఢచార సంస్థలు చెబుతున్నాయి. ఐఎస్‌ఐ అధికారులు అవసరమున్న ప్రతిసారి హఫీజ్ సరుూద్ ట్విట్టర్ ఖాతా ద్వారా తమ అభిప్రాయాలను ప్రపంచానికి వెల్లడిస్తున్నారని భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి. జెఎన్‌యు విద్యార్థుల ఉద్యమం, కాశ్మీర్ గొడవకు మద్దతు ప్రకటనలు కూడా ఐఎస్‌ఐ నిర్వాకమేనని వారంటున్నారు. ఐఎస్‌ఐ పలు అంశాలపై ట్వీట్‌లు చేస్తోందనీ, రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించిన హఫీజ్ సరుూద్ ట్వీట్ కూడా ఇలాంటిదేనని వారు చెబుతున్నారు. ఐఎస్‌ఐ హఫీజ్ సరుూద్ పేరుతో పది, పనె్నండు ట్విట్టర్ ఖాతాలు నిర్వహిస్తూ భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. భారతదేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని వారంటున్నారు. హఫీజ్ సరుూద్ పేరుతో ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో కొనసాగుతున్న సోషల్ మీడియా ఖాతాలను మూయించేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హఫీజ్ సరుూద్ పేరుతో కొనసాగుతున్న ఖాతాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్ సంస్థలను ఎన్‌డిఏ ప్రభుత్వం కోరనున్నది. ఈ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్ సంస్థలకు పంపించి రద్దు చేయాలని లేఖలు రాయాలని నిర్ణయించింది. దీనితో పాటు భారత్ వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకునేందుకు భద్రతా విభాగానికి చెందిన సైబర్ సెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.