జాతీయ వార్తలు

వైజాగ్‌లో పెట్రో వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ-పెట్రోలియం యూనివర్శిటీ)కి పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం నాడు ఆమోద ముద్ర వేసింది. వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న ఐఐపిఇని తాత్కాలికంగా ఆంధ్రాయూనివర్శిటీ ప్రాంగణంలో నెలకొల్పుతారు.
మూడేళ్ల వ్యవధిలో సొంత భవన ప్రాంగణాలను, వౌలిక సదుపాయాలను కల్పించుకున్న తర్వాత యూనివర్శిటీ అక్కడకు తరలివెళ్లనుంది. ఈ మేరకు ఆంధ్రాయూనివర్శిటీతో కేంద్ర పెట్రోలియం శాఖ మూడేళ్ల కాలానికి అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రిత్వశాఖ తరఫున హెచ్‌పిసిఎల్ ఈ సంతకం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు పెట్రోలియం వర్శిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వశాఖ ఢిల్లీలో ఒక ప్రకటన చేసింది. వౌలిక సదుపాయాల అంశంపై ఈ నెల 4వ తేదీన అధికారులు యూనివర్శిటీ పాలకులతో చర్చించిన మీదట పెట్రోలియం శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2016-17 విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభిస్తామని పెట్రోలియం శాఖ పేర్కొంది.