జాతీయ వార్తలు

సాగుకు డిజిటల్ వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: దేశంలోని రైతాంగానికి డిజిటల్ ఇండియా సాంకేతిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ ప్రకటించారు. డిజిటల్ ఇండియాతో దేశంలో 250 వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ కోసం ప్రధాన వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. టెక్నాలజీకి దేశ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేస్తే రైతులకు అన్ని విధాలా లబ్ధి చేకూరుతుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని సిహోర్ జిల్లాలోని షేర్‌పూర్‌లో జరిగిన రైతు ర్యాలీలో ప్రధాని మోదీ ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం అనేక రకాలుగా రైతాంగం జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. అలాగే బిజెపి సారధ్యంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రైతాంగం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు వల్ల రైతులకు ఓ బలమైన వేదిక అందుబాటులోకి వస్తుందని దీని ద్వారా తమ ఉత్పత్తులకు గరిష్ఠ స్థాయిలో ధరను పొందే అవకాశం ఉంటుందని ప్రధాని వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు తమ ఉత్పత్తులను వివిధ మార్కెట్లలో వాటి ధరలకు అనుగుణంగానే విక్రయిస్తూ వచ్చారని దీని కారణంగా గిట్టుబాటు ధర రాక ఎంతగానో నష్టపోయారని మోదీ తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే జాతీయ స్థాయిలో వ్యవసాయ మార్కెట్‌కు తమ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కడ గరిష్ఠ స్థాయి ధర పలుకుతుందతో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లద్వారా ఈ వివరాలు అందుకోవచ్చని మోదీ స్పష్టం చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పంటల బీమా పథకం ఓ సంజీవనిలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం... మధ్యప్రదేశ్‌లో గురువారం జరిగిన రైతు ర్యాలీలో ప్రధాని మోదీ,
విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్