జాతీయ వార్తలు

సెంట్రల్ వర్శిటీలలో త్రివర్ణ పతాక రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరజ్‌కుండ్: దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఆవరణలలో ఇకనుంచి ప్రధానమైన ప్రాంతంలో 207 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాలు ఎగురనున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయం చెప్పింది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఆవరణలో ఇటీవల వివాదాస్పద దేశ వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సూరజ్‌కుండ్‌లో హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ యూనివర్శిటీల వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. జెఎన్‌యు కేంద్రీయ విశ్వవిద్యాలయం అయినందున ఈ నిర్ణయం దానికి కూడా వర్తిస్తుందని ఆ అధికారి తెలిపారు. ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థుల్లో దేశ సమైక్యత, సమగ్రత అనే భావాలను పాదుకొల్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ఆందోళన చెలరేగి, విశ్వవిద్యాలయాలలో అణగారిన వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ ఈ వైస్ చాన్స్‌లర్ల సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశం జరగడానికి కొద్ది రోజుల ముందే జెఎన్‌యులో కొంతమంది దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడం, తరువాత వర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు దేశద్రోహం అభియోగాల కింద అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టుపై విద్యార్థులు సహా వివిధ వర్గాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో చర్చించారు.