జాతీయ వార్తలు

రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇదో పెద్ద దెబ్బ. రాహుల్‌పై దేశద్రోహం అభియోగాల కింద కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన వివాదంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సమావేశమైనందుకు ఈ కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అలహాబాద్ సిజెఎం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయిన నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని ఒక హిందీ దినపత్రిక తెలిపింది. జెఎన్‌యు క్యాంపస్‌లో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులకు రాహుల్ గాంధీ మద్దతిచ్చారని ఈ పిటిషన్‌లో ఆరోపించారు. జెఎన్‌యు క్యాంపస్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ, దేశద్రోహం అభియోగాల కింద జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ కుమార్‌ను అరెస్టు చేయడాన్ని ఖండించడంతో పాటు విద్యార్థుల గొంతు నొక్కేవారే నిజమైన జాతి వ్యతిరేకులని మండిపడిన విషయం తెలిసిందే. కన్హయ కుమార్ కేవలం తన భావాలను వ్యక్తీకరించారని, అయితే ప్రభుత్వం అతనిపై దేశద్రోహి అని ముద్ర వేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

చిత్రం... రాహుల్ సారథ్యంలో గురువారం రాష్టప్రతి ప్రణబ్‌కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం