జాతీయ వార్తలు

మొద్దునిద్ర నటిస్తున్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడికి సంబంధించి మన దేశం అదజేసిన సాక్ష్యాధారాలను పాక్ కొట్టిపారేయడాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీవ్రంగా తప్పుబడుతూ, ఈ వ్యవహారంలో పాక్ మొద్దు నిద్రను నటిస్తోందని, దర్యాప్తు విషయంలో దానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అంతేకాదు ఈ దాడికి సంబంధించి పాక్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి అనుమతించేది లేదని కూడా ఓ ప్రైవేటు టీవీ న్యూస్ చానల్ కోసం కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. భారత్ అందజేసిన సాక్ష్యాధారాలు బలంగా లేవంటూ పాక్ చేస్తున్న వాదన గురించి అడగ్గా, ఆయన ఈ విషయం చెప్పారు. భారత్ అందజేసిన పాకిస్తానీ మొబైల్ నంబర్లు రిజిస్టర్ కానివని, అలాగే తప్పుడు ఐడెంటిటీలు కలిగి ఉన్నాయని పాక్ చెప్తున్న మాటలను కూడా పారికర్ తప్పుబట్టారు. ఎన్నో దాడులకు సంబంధించి మన దేశం పాక్‌కు నిరంతరంగా సాక్ష్యాధారాలు ఇస్తూనే ఉందని ఆయన చెప్పారు. దానిపై ఎవరైనా సీరియస్‌గా ఉన్నట్లయితే తప్పకుండా చర్య తీసుకుంటారని పారికర్ చెప్పారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి పాక్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను అనుమతిస్తారా అని అడగ్గ, పాక్‌నుంచి అలాంటి అభ్యర్థన వచ్చినట్లు తనకు తెలియదని ఆయన చెప్పారు. ఎయిర్‌బేస్‌లలు, రక్షణ సంస్థలకు సంబంధించినంతవరకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ఎవరిని కూడా వాటిలోకి అనుమతించేది లేదని అన్నారు. కాగా, పాక్‌కు ఎఫ్-16 యుద్ద విమానాలను విక్రయించాలన్న అమెరికా నిర్ణయం తనకు బాధ కలిగించిందని పారికర్ తెలిపారు. ఒకే ర్యాంక్, ఒకే పింఛను అంశం గురించి అడగ్గా, సైన్యం ప్రయోజనాల దృష్ట్యా మెరుగైన అవకాశాల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ, గడువుకన్నా ముందే రిటైర్మెంట్‌ల మధ్య తేడాను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని చెప్పారు. గడువుకన్నా ముందే రిటైర్మెంట్ అంశాన్ని పరిశీలించడానికి ఒక జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు సంబంధించి సైనికుల్లో అసంతృప్తి గురించి అడగ్గా, సైనికులకు ఉంబందించి న్యాయమైన సమస్యలన్నిటినీ తమ శాఖ పరిష్కరిస్తుందని చెప్పారు. సైన్యంలో చెత్తా చెదారాన్ని ఏరి పారేయడానికి కూడా తమ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని చెప్పారు.
అయితే సైన్యం సామర్థ్యత విషయంలో మాత్రం రాజీ ప్రసక్తే లేదని పారికర్ స్పష్టం చేశారు.