జాతీయ వార్తలు

సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన 68వ పుట్టిన రోజయిన ఈ నెల 24నుంచి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలో సీనియర్ సిటిజన్లకు (అరవై ఏళ్లకు పైబడిన వృద్ధులు) ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 2011లో పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిందని గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటిస్తూ జయలలిత చెప్పుకొన్నారు. మరో 3 నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ‘సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేము మా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది.. ఈ ప్రకటనతో 2011లో అన్నా డిఎంకె పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీలన్నిటినీ నెరవేర్చిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’ అని జయలలిత అన్నారు. ఈ తాజా చర్యతో అన్నాడిఎంకె ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు - ఉచితంగా పాడి ఆవుల పంపిణీ, గొర్రెలు, మిక్సీలు, గ్రైండర్లు, విద్యార్థులకు లాప్‌టాప్‌లు లాంటి ఉచిత తాయిలాల సిరీస్‌లో ఈ ఉచిత ప్రయాణం తాజాది. ‘అన్ని ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పాటుగా తాము అనేక ఇతర సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను’ అని జయ అన్నారు. మొదటి దశలో ఉచిత ప్రయాణ పథకాన్ని చెన్నైలో నడిచే ఎంటిసి బస్సులలో అమలు చేస్తారని ఆమె చెప్పారు.
ఈ పథకం కింద అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు ఎసి బస్సులు తప్ప మిగతా అన్ని ఎంటిసి బస్సుల్లోను ఉచితంగా ప్రయాణించవచ్చు. లబ్ధిదారులకు నెలకు పది టోకెన్లు ఇస్తారని, వారు ఆ టోకెన్‌ను బస్సుల్లోని కండక్టర్‌కు ఇచ్చి బస్సులో ఉచితంగా పర్యటించవచ్చు. ఈ పథకాన్ని ఫిబ్రవరి 24నుంచి అమలు చేయడం జరుగుతుందని, ప్రజలనుంచి అభిప్రాయాలను విశే్లషించిన తర్వాత ఈ పథకాన్ని మొత్తం రాష్ట్రంలో అమలుచేయడం జరుగుతుందని జయలలిత చెప్పారు. ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునేవారు ఒక దరఖాస్తు ఫారాన్ని భర్తీ చేసి దాన్ని రవాణా అధికారులకు సమర్పించి ఒక గుర్తింపు కార్డును, పది టోకెన్లను పొందవచ్చును. ఈ ఫారాలను అన్ని ఎంటిసి బస్సు డిపోల్లోను, అలాగే రవాణా శాఖ వెబ్‌సైట్‌నుంచి పొందవచ్చని ఆమె చెప్పారు. దరఖాస్తులను సమర్పించడానికి ఎలాంటి డెడ్‌లైనూ లేదని, వీటిని ఏ ఎంటిసి డిపోల్లో ఎప్పుడైనా సమర్పించవచ్చని జయలలిత చెప్పారు. జయలలిత ఈ ప్రకటన చేయగానే రవాణా మంత్రి తంగమణి, స్పీర్ ధనపాల్, ఎనిమిది మంది శాసన సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ఈ కొత్త పథకాన్ని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.