జాతీయ వార్తలు

అరుణాచల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను కొనసాగించడంపై యథాతథ స్థితిని కొనసాగించాలని బుధవారం జారీ చేసిన ఉత్తర్వును ఎత్తివేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. మాజీ స్పీకర్ నబమ్ రెబియా 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడానికి సంబంధించి న్యాయపరమైన, అసెంబ్లీ రికార్డులను పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఈ అనుమతి ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఆరవ అసెంబ్లీ సమావేశాలను దాదాపు నెల రోజులు ముందుకు జరపడంపై రాజ్యాంగపరంగా తనకున్న విశేషాధికారాలను గవర్నర్ జెపి రాజ్‌ఖోవా ఉపయోగించుకోవడాన్ని కోర్టు ఇంతకుముందు తప్పుబట్టిన విషయం తెలిసిందే. రాజకీయంగా అత్యంత గందరగోళంగా ఉన్న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరడానికి ఈ నెల 15న (సోమవారం) కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు రాజ్‌ఖోవాను కలిశారు. ఆయన వెంట 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది బిజెపి లెజిస్లేటర్లు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు.