జాతీయ వార్తలు

గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ ఎస్‌ఎఆర్ గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పాటియాలా కోర్టులో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు స్టేషన్‌లోనే న్యాయమూర్తి ఎదుట గిలానీని హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన విచారణ నిమిత్తం పాటియాలా కోర్టునుంచి న్యాయమూర్తి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చాణక్యపురి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. పాటియాల కోర్టులో జరిగిన ఘటనల నేపథ్యంలో గిలానీని కోర్టుకు తీసుకువచ్చేందుకు పోలీసులు సాహసించలేదు. పాటియాలా కోర్టులో జరిగిన ఘటనలపై పోలీసుల చర్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు చేసిన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి పోలీసు స్టేషన్‌కు వచ్చి గిలానీని విచారణ జరిపి విచారణ జరిపి జ్యుడీషియల్ కస్టడీ ఆదేశాలు జారీచేశారు. పోలీసు కస్టడీ అవసరం లేదన్న పోలీసులు న్యాయమూర్తికి తెలియజేయడంతో జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కాగా, గిలానీ తరపున న్యాయవాది సతీష్ తంప్తా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.