జాతీయ వార్తలు

ఇద్దరు కెప్టెన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: శ్రీనగర్ శివార్లలోని పాంపోర్ పట్టణంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పారా యూనిట్‌కు చెందిన ముగ్గురు కమాండోలు వీరమరణం పొందారు. వీరిలో ఇద్దరు కెప్టెన్ స్థాయి అధికారులు కాగా, మరొకరు జవాను. కెప్టెన్ పవన్ కుమార్, కెప్టెన్ తుషార్ మహాజన్, జవాను ఓంప్రకాశ్ ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టడంలో ఆర్మీ విజయం సాధించింది. దీంతో రెండు రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. పాంపోర్‌లోని ఇడిఐ (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్) భవనంలో నక్కిన ఉగ్రవాదులతో శనివారం నుంచి హోరాహోరీగా పోరాడుతున్న భద్రతా సిబ్బంది ఆ భవనం నుంచి దాదాపు 100 మంది ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మధ్యాహ్నం ఆ భవనంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆదివారం తెల్లవారు జామున భద్రతా బలగాలు ఆ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఉగ్రవాదులు భీకర కాల్పులకు తెగబడ్డారని సైనికాధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన యువ సైనికాధికారి కెప్టెన్ పవన్ కుమార్‌తో పాటు పారా యూనిట్‌కు చెందిన ఓం ప్రకాష్ అనే మరో జవాను తీవ్రంగా గాయపడి బాదామీబాగ్ కంటోనె్మంట్‌లోని సైనిక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆ అధికారి వివరించారు. ఉధంపూర్‌కు చెందిన కెప్టెన్ తుషార్ మహాజన్ కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డారని, తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆ అధికారి తెలిపారు. ఉగ్రవాదులు శనివారం ఇఐడి భవనంలోకి చొరబడటానికి ముందు శ్రీనగర్-జమ్మూ రహదారిలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడికి తెగబడి ఇద్దరు జవాన్ల ప్రాణాలు తీయడంతో పాటు మరో తొమ్మిది మంది పౌరులను గాయపర్చిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదుల వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోందని, కనుక వారి ఏరివేతకు మరింత సమయం పట్టవచ్చని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
జమ్ము రీజియన్‌లో హైఅలర్ట్
జమ్ము: జమ్ము-శ్రీనగర్ హైవేపై గల పాంపోర్ పట్టణంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి గల ఉగ్రవాదులు భద్రతా దళాలతో తలపడుతుండడంతో జమ్ము రీజియన్‌లో భద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జమ్ములోని ఉగ్రవాద వ్యతిరేక బలగాలు అప్రమత్తమయ్యాయి. కీలక ప్రదేశాల వద్ద భద్రతను పెంచారు.

చిత్రం... పాంపోర్‌లో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మృతిచెందిన
కెప్టెన్ పవన్‌కుమార్ మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మిలటరీ అధికారులు

ఉగ్రవాదులు నక్కిన భవనం నుంచి వెలువడుతున్న పొగలు