జాతీయ వార్తలు

ఆంధ్ర సహా ఆరు రాష్ట్రాల్లో ఐఐటిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఆరు ఐఐటిలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్నాటక, కేరళ, జమ్ము,కాశ్మీర్, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించారు. ముందుగా 1860నాటి సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద సొసైటీలను ఏర్పాటు చేసి ఈ ఐఐటిలను ప్రారంభిస్తారు. సాంకేతిక సంస్థల చట్టానికి సవరణ చేసే వరకూ వీటికి చట్టపరమైన హోదాను కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి నిర్వహణకు 1,411.80కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది.