జాతీయ వార్తలు

కేంద్రాన్ని.. సంప్రదించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రతించకుండా కేంద్ర చట్టాల కింద విచారించిన, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు ఏజన్సీలు దర్యాప్తు జరిపిన కేసుల్లో యావజ్జీవ శిక్షలుపడిన నేరస్థుల శిక్షలను తగ్గించే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణ శిక్షలు పడిన దోషులను విడిచిపెట్టాలన్న తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలెత్తిన రాజ్యాంగపరమైన అంశాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శిక్షలను తగ్గించే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ అవి తనకు తానుగా ఆ అధికారాన్ని వినియోగించుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కేంద్ర చట్టాల కింద నమోదయిన, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరిపిన కేసుల్లో శిక్షలు పడిన దోషులకు శిక్షలను తగ్గించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇంతకుముందు ఇంతకన్నా చిన్న బెంచ్ లేవనెత్తిన అన్ని అంశాలకు సమాధానం ఇవ్వడంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన బెంచ్ జీవిత ఖైదును నిర్దేశించిన నేరాల విషయంలో శిక్ష ఎన్ని సంవత్సరాలో నిర్ణయించే అదికారం కోర్టులకు ఉంటుందా అనే దానిపై మాత్రం 3:2 తేడాతో విభేదించింది. అలా నిర్ణయించే అధికారం కోర్టులకు ఉందని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయ పడ్డారు. కాగా, రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు శిక్షలు తగ్గించే అంశానికి సంబంధించిన వాస్తవ అంశాలు, న్యాయపరమైన అంశాలను బెంచ్ త్రిసభ్య ధర్మాసనానికి నివేదించింది. ఈ రోజు తీర్పు చెప్పిన ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా, పినాకి చంద్ర హోష్, అభయ్ మనోహర్ సప్రే, యుయు లలిత్‌లు కూడా ఉన్నారు.