జాతీయ వార్తలు

పార్లమెంట్ మహోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గొడవ గందరగోళాలతో పార్లమెంటు సమావేశాలను దెబ్బతీయటాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. సభ్యులు పరస్పర సహకారం, సర్దుకుపోవటం ద్వారా ఉభయ సభలు సజావుగా సాగేలా చూడాలని హితవు చెప్పారు. మంగళవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. దేశ ప్రజల మహోన్నత సంకల్పానికి పార్లమెంట్ అద్దం పడుతుంది కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చ, సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప అంతరాయం, అవరోధం, గందరగోళం ద్వారా కాదని ఎంపీలకు సూచించారు. సభలను సజావుగా నిర్వహించటంతోపాటు నిర్మాణాత్మకంగా పని చేసేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. జాతీయ భావంపై దేశంలో జరుగుతున్న చర్చపై ప్రణబ్ ముఖర్జీ పరోక్ష విమర్శలు గుప్పించారు. సత్యం, శివం, సుందరం వంటి అత్యున్నత ఆదర్శాలను పాటించటం వల్లే జాతీయ భావానికి ప్రేరణ లభిస్తుందన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలు ఉటంకిస్తూ ప్రణబ్ తన ప్రసంగాన్ని ముగించటం గమనార్హం. 1.03 గంటలపాటు సాగిన ప్రసంగంలో 20 నెలల ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. ఎన్డీయే భవిష్యత్ లక్ష్యాలు, పథకాలను రాష్టప్రతి ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రభుత్వం కేవలం ఆర్థికాభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించకుండా అందరి అభివృద్ధి, అభ్యున్నతి (సబ్ కా వికాస్)పై దృష్టి కేంద్రీకరించిందన్నారు. అందరి అభివృద్ధి అంటే మొత్తం ప్రపంచాభివృద్ధి అని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, వాతావరణ కాలుష్యం, ఆర్థిక అస్తిరత్వం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ బాధ్యతగల దేశంగా వ్యవహరించాలని ఉద్భోదించారు. దేశంలోని అతి పేదలకు ప్రభుత్వ పథకాల ఫలాలు ముందుగా అందాలన్నారు. ఆర్థిక సామర్థ్యం, సామాజిక భద్రతల ద్వారా ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. సాగును మరింత పటిష్టం చేయడం ద్వారా రెండో హరిత విప్లవం సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కోట్లాది ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి జరుగుతోందని, గ్రామీణాభివృద్ధి అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యమన్నారు. మనది వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూనే, ద్రవ్యోల్భణం, ఆర్థిక లోటు, ప్రస్తుత ఖాతా లోటు తగ్గాయని ప్రణబ్ ప్రకటించినప్పుడు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించారు. 2015లో అత్యధిక విదేశీ మారకం నిల్వలను రికార్డు చేశామని, గ్రామ పంచాయితీల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం రానున్న ఐదేళ్లకు రెండు లక్షల కోట్లు కేటాయించటాన్ని ప్రశంసించారు. అవినీతి నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని, నల్లధనం సమస్య పరిష్కారంలో ప్రభుత్వ చర్యలు ఫలితాలిస్తున్నాయని అన్నారు. పఠాన్‌కోట్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టినందుకు భద్రతా దళాలను ప్రణబ్ కొనియాడారు. స్మార్ట్ నగరాల అభివృద్ధితో మంచి ఫలితాలు ఉంటాయంటూనే, స్వచ్చ భారత్ సాధనకు పెద్ద ఎత్తున కృషి జరుగుతోందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

చిత్రం,,, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో రాష్టప్రతి ప్రణబ్‌ను సెంట్రల్ హాల్‌కు తోడ్కొని వస్తున్న స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి వెంకయ్య