జాతీయ వార్తలు

తక్షణ సాయం 100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కరవు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను ఆదుకునేందుకు తొలివిడతగా ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద వందకోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. దీంతోపాటు ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద 46 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను వివరించి, తగిన సాయం అందించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు కోరుతూ, బుధవారం కేంద్ర మంత్రిని కలిశారు.
రాష్ట్రంలో 249 మండలాలను కరవుపీడిత మండలాలుగా ప్రకటించినట్టు రాధామోహన్ సింగ్‌కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన కరవు నివేదిక పరిశీలించిన తరువాత రెండురోజుల్లో అధికార బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని రాధామోహన్ సింగ్ వారికి హామీ ఇచ్చారు. కేంద్ర బృందం నివేదిక అందించిన తరువాత ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో నివేదికను చర్చించి తదుపరి సాయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలంగాణ మంత్రులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో పత్తి రైతాంగం పడుతున్న ఇబ్బందులను కేంద్ర జౌళి మంత్రి సంతోష్ గాంగ్వార్‌కు మంత్రుల బృందం వివరించింది. కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు ఐదువేలకు పెంచాలని తెలంగాణ మంత్రులు చేసిన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అధికారం జౌళి శాఖకు లేదని గాంగ్వార్ చేతులెత్తేశారు. ధర పెంపుపై ఆర్థిక శాఖ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని ఆయన చెప్పారు.