ఆంధ్రప్రదేశ్‌

మెట్రో రుణ ప్రక్రియ వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రుణ ప్రక్రియ వేగవంతం చేయాలని సిఎం చంద్రబాబు జపాన్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా)కు విజ్ఞప్తి చేశారు. బుధవారం సిఎంఓలో యసునొరి టకాషి నేతృత్వంలో జైకా ప్రతినిధి బృందం చంద్రబాబుతో భేటీ అయ్యింది. రెండు కారిడార్లలో 25.76 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ప్రాజెక్టులో తొలిదశ నిర్మాణానికి రూ.5,705 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారని, రుణ మంజూరీకి ముందుకొచ్చిన ‘జైకా’ను అభినందిస్తూ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. జైకా ప్రతినిధి బృందం 15 నెలల వ్యవధి కోరగా, సిఎం స్పందిస్తూ అంత వ్యవధికి అవకాశం లేదన్నారు. కనీసం నాలుగైదు నెలల్లో రుణ మంజూరు ప్రక్రియ పూర్తిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి లేదా మరే కారణంతో అయినా సమస్యలు వస్తే తనకు తెలియజేయాలని, సిఎం స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను కేవలం ఐదు నెలల కాలంలో రెండు నదులను అనుసంధానం చేశానని జపనీస్ బృందానికి గుర్తు చేశారు. ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదన్నారు. జపాన్ కంపెనీలు అమరావతిలో కార్యాలయాలు తెరవాలన్నది తమ ఆకాంక్ష అని, జపాన్‌కు భారత్‌తో సత్సంబంధాలున్నాయని, ఆంధ్రతో జపాన్‌కూ అనుబంధం ఉందన్నారు. ‘మీకు టెక్నాలజీ ఉంది. మీ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ మంచి మార్కెట్ అవుతుంది’ అన్నారు. భారతదేశం వృద్ధి రేటు 7.2 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 10.5 శాతంగా నమోదైందని ముఖ్యమంత్రి జైకా ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా జైకాకు అన్ని విధాల సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండి ఎన్‌పి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 20 శాతాన్ని ప్రభుత్వం, మరో 20 శాతాన్ని కేంద్రం భరిస్తుండగా మిగిలిన 60 శాతాన్ని రుణంగా ఇవ్వడానికి జైకా ముందుకొచ్చింది. జైకా బృందం ఏప్రిల్‌లో సిఎంతో మరోపర్యాయం భేటీ కానుంది.