జాతీయ వార్తలు

నిండా ముంచేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదో విపత్తు. వరుణ విలయం. వందేళ్లలో కనీవీనీ ఎరుగని కుంభవృష్టి. గత రెండు రోజులుగా తమిళనాడును ముంచెత్తుతున్న భీకర వర్షాలు బుధవారం రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించాయి. ఒక్క రోజులోనే అనూహ్య రీతిలో 45 సెంటీమీటర్ల వర్షం పడటంతో అన్ని రహదారులూ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల మొదటి అంతస్తులోకీ నీళ్లు రావడం వర్ష తీవ్రతను కళ్లకు కడుతోంది. జన జీవనం పూర్తిగా స్తంభించింది. స్కూళ్లు, బ్యాంకులు, ఎటిఎంలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, విమానాలు, రైళ్ల రాకపోకలూ పూర్తిగా నిలిచిపోయాయి. సెల్‌ఫోన్లూ పనిచేయకుండా పోయాయి. మరో రెండు రోజులపాటు పరిస్థితి భయానకమేనని ఐఎమ్‌డి హెచ్చరించింది. సహాయ, సంక్షేమ బృందాలు రంగంలోకి దిగి, నీటినుంచి జనాన్ని రక్షించే చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. తమిళనాడును అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ మంత్రులతో చర్చించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చిత్రం... ఫ్లైఓవర్ మీదుగా పొంగి పొర్లుతున్న అడయార్ నది

చెన్నై-గూడూరు
మార్గంలో రైళ్ల రద్దు

పలు రైళ్ల మళ్లింపు

విజయవాడ, డిసెంబర్ 2: భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై- గూడూరు రైలు మార్గాలలో అనేక రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దయిన రైళ్ల వివరాలు: 17644 కాకినాడ - చెన్నై ఎగ్‌మోర్, 12604 హైదరాబాద్ - చెన్నై సెంట్రల్, 12760 హైదరాబాద్ - చెన్నై ఛార్మినార్, 17652 కాచిగూడ - చెన్నై ఎగ్‌మోర్, 16031 చెన్నై - శ్రీమఠ వైష్ణోదేవి కాట్రా అండమాన్, 12621 చెన్నై - న్యూఢిల్లీ తమిళనాడు, 12840 చెన్నై - హౌరా మెయిల్, 12842 చెన్నై - హౌరా కోరమండల్, 12656 చెన్నై - అహ్మదాబాద్ నవజీవన్, 22611 చెన్నై - న్యూజలపైగురి, 22403 పాండిచ్చేరి - ఢిల్లీ, 08301 సంబల్‌పూర్ - యశ్వంత్‌పూర్ సువిధ స్పెషల్, 08302 యశ్వంత్‌పూర్ - సంభల్‌పూర్ స్పెషల్, 22601 చెన్నై - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. 12711 విజయవాడ-చెన్నై పినాకిని గూడూరు వరకు వెళ్తుంది. 12712 చెన్నై-విజయవాడ పినాకిని గూడూరు నుంచి విజయవాడ వరకు నడుస్తుంది.
17652 కాచిగూడ- చెన్నై ఎగ్‌మోర్ తిరుత్తరణి-చెన్నై మధ్య రద్దయింది. 12507 త్రివేండ్రం - గౌహతిని మెల్పక్కం, తిరుత్తరణి, రేణిగుంట, గూడూరు మీదుగా మళ్లించారు. 16351 ముంబయి సిఎస్‌టి - నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్‌ను తిరుత్తరణి మీదుగా మళ్లించారు. 12898 భువనేశ్వర్ - పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ను పెరంబూర్ మీదుగాను, 12507 త్రివేండ్రం - గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను మేళ్లపాకం, తిరుత్తరణి మీదుగా మళ్లించారు.

చెన్నైకి నేవీ బృందాలు

ఆహార పదార్థాలు తీసుకెళ్లిన ఐరావత్ నౌక

విశాఖపట్నం, డిసెంబర్ 2: భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై, చుట్టు పక్కల ప్రాంతాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో సహాయచర్యలకు తూర్పు నావికాదళం రంగంలోకి దిగింది. వరద బాధిత ప్రాంతాలకు విశాఖ నుంచి ఐరావత్ నౌకలో ఆహార పదార్థాలను పంపించారు. అదే విధంగా హెలీకాప్టర్ల ద్వారా సహాయచర్యలు చేపడుతున్నారు. విశాఖ, రజాలి నుంచి మూడు ప్రత్యేక బృందాలను అక్కడకు పంపినట్టు కెప్టెన్ డికె శర్మ బుధవారం విశాఖలో తెలిపారు. విశాఖ నుంచి రెండు బృందాలు వెళ్లగా, మూడో బృందం రజాలి ప్రాంతం నుంచి బయలుదేరిందని, ఈ బృందంలో 50 మంది నావికులు ఉన్నారన్నారు. ఈ బృందాల్లోని సభ్యులు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో సహాయచర్యలు చేపడుతున్నారన్నారు. జెమినీ బోట్ల ద్వారా బాధితులకు ఆహార పొట్లాలు అందచేస్తున్నామన్నారు. అదనపు బోట్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. దాంతోపాటు అత్యవసర పరిస్థితిలో సేవలు అందించేందుకు ఓడలను సిద్ధంగా ఉంచామన్నారు. ఇదిలా ఉండగా ఐఎన్‌ఎస్ చెట్‌లాట్ ద్వారా సముద్రంలో గల్లంతైన బోట్లను వెతుకుతున్నామన్నారు. మంగళవారం రాత్రి గల్లంతైన బోట్‌ను గుర్తించామన్నారు. అలాగే పాండిచ్చేరి ఎన్‌సిసి ద్వారా అవసరమైన సాయం అందజేస్తున్నామన్నారు. ఐఎన్‌ఎస్ ఆధ్వర్యంలో వంద మంది వరద బాధితులకు రక్షణ కల్పించామన్నారు. వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు నేవి హెలీకాప్టర్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామన్నారు.

రైల్వే ట్రాక్‌లపై నీళ్లు నిలిచిపోవడంతో చెన్నైలో ఆగిపోయన రైళ్లు