జాతీయ వార్తలు

వీళ్లను క్షమించాలా? ఆ విద్యార్థులది జాతి వ్యతిరేకతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎన్‌యు అధికారులే ధ్రువీకరించారు
రోహిత్ ఘటనపై సిఎం కెసిఆర్‌కు ఫోన్ చేశా
కనీసం ఎంపీ కవిత కూడా స్పందించ లేదు
తెలంగాణ బలిదానాలు పట్టని రాహుల్
హైదరాబాద్ వర్సిటీకి రెండుసార్లు వచ్చాడు
శవ రాజకీయాలకు తెరలేపడం సబబా?
విద్యా వ్యవస్థ కాషారుూకరణ అబద్ధం
రుజువు చేస్తే తప్పుకుంటా
విపక్షాలపై నిప్పులు చెరిగిన స్మృతిఇరానీ
వర్శిటీల ఘటనలపై లోక్‌సభలో దుమారం

వర్శిటీల్లో జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడినవాళ్లు చిన్న పిల్లలా? వాళ్లను వెనకేసుకొస్తారా? జెఎన్‌యులో కవితా పఠనానికి హాలు తీసుకుని భారతదేశం ముక్కలుకావాలని నినాదాలిస్తే క్షమించాలా? విద్యారంగాన్ని రాజకీయం చేసి, విద్యార్థులను ఓటు బ్యాంకుగా మార్చే నేతలుంటే విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలివ్వకుండా మరో నినాదాలిస్తారా? మీ దేశభక్తిని నేను గౌరవిస్తా. నా దేశభక్తిని అనుమానించకండి. జాతీయత విషయంలో విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన నన్ను శిలువెక్కించకండి.
నా పేరు స్మృతి ఇరానీ. మీకు సవాల్ చేస్తున్నా. నా కులమేంటో చెప్పగలరా? సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ మరణంపై కుల రాజకీయం రేపుతారెందుకు? విద్యార్థి చనిపోయాడని తెలిసి సిఎం కెసిఆర్‌కు ఫోన్ చేస్తే ఆయన తీరిక లేకుండా ఉన్నార్ట. కనీసం ఆయన కుమార్తె, ఎంపీ కవిత కూడా స్పందించలేదు. తెలంగాణ ఉద్యమంలో 600మంది చనిపోతే ఒక్కసారీ కదలని రాహుల్, రోహిత్ విషయంలో వర్శిటీకి రెండుసార్లు వెళ్లడంలో ఆంతర్యమేమిటి? అసలు రోహిత్ మరణించాడని ఎవరు ప్రకటించారు? వైద్యులా? రాజకీయం చేయాలనుకున్న విద్యార్థులా? చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఘటనల్లో న్యాయ వ్యవస్థను పని చేయనివ్వండి. బాధితులకు న్యాయం చేకూరనివ్వండి

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యూ వ్యవహారాలు బుధవారం లోక్‌సభను అట్టుడికించాయి. సుదీర్ఘ చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని విపక్షాలపై నిప్పులే చెరిగారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు విపక్షాల ధోరణిని అడుగడుగునా ఎండగట్టారు. కన్నయ కుమార్, ఇతర విద్యార్థులు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు జెఎన్‌యూ అధికారులే ధృవీకరించారన్నారు. రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఎదురుదాడికి దిగారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ రాసిన లేఖమూలంగా తాను జోక్యం చేసుకోవటం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారంటూ తీవ్రస్వరంతో దుయ్యబట్టారు. జెఎన్‌యులో కవితా పఠనానికి హాలు తీసుకుని, భారతదేశం ముర్దాబాద్, భారత సైన్యం ముర్దాబాద్, కాశ్మీర్‌కు స్వాతంత్రం కావాలి, భారతదేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలిస్తే సహించాలా? అంటూ గట్టిగా ప్రశ్నించారు. వీరు అమాయక విద్యార్థులా? వీరిని వదిలి పెట్టాలా? అంటూ స్మృతి ఇరానీ ప్రతిపక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యారంగాన్ని రాజకీయ యుద్ధక్షేత్రంగా మార్చొద్దని ఆమె ప్రతిపక్షానికి హితవు పలికారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షం, అధికార పక్షానికి చెందిన వేలాదిమంది వివిధ అంశాలపై రాసే లేఖలపై తాను చర్య తీసుకుంటాననేది మీ అందరికీ తెలుసంటూ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ, జెఎన్‌యులో తలెత్తిన వివాదాస్పద సంఘటనలపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు స్మృతిఇరానీ సమాధానమిచ్చారు. జెఎన్‌యులో దేశ వ్యతిరేక నినాదాలిస్తున్న వాళ్లను చిన్న పిల్లలని కొందరు వెనకేసుకొస్తున్నారు. ఇదెంత మాత్రం మంచిది కాదన్నారు. విద్యారంగాన్ని రాజకీయం చేసి, విద్యార్థులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటే జెఎన్‌యు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలివ్వకుండా మరో నినాదాలిస్తారా? అని ఆగ్రహంతో ఊగిపోయారు. రోహిత్ మృతదేహాన్ని రాజకీయానికి వాడుకునే వారివల్లే దేశానికి కీడు సంభవిస్తోందన్నారు. మానవ వనరుల మంత్రిగా నా విధులను సక్రమంగా నిర్వర్తించాను. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి క్షమాపణలు చెప్పేది లేదని తెగేసి చెప్పారు. అనేకమంది ఎంపీలు వివిధ అంశాలపై లేఖలు రాస్తుంటారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, సంస్థలకు మా శాఖ లేఖలు రాస్తుంది. మీరందరి లేఖలపై చర్య తీసుకున్నందుకు నాపై ఆరోపణలు చేస్తారా? అంటూ నిలదీశారు. సెంట్రల్ స్కూళ్లలో సీట్లకోసం మీరు లేఖలు రాస్తే పని చేయలేదా? అంటూ ప్రశ్నించారు. తాను చెబుతున్నది వినకుండా ప్రతిపక్ష సభ్యులు ఎందుకు బయటకు వెళ్తున్నారంటూ నిలదీశారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్ వర్శిటీకి, జెఎన్‌యుకి రెండుసార్లు రాజకీయం చేసేందుకే వెళ్లారంటూ దుయ్యబట్టారు. రోహిత్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న వారంతా యూపీఏ ప్రభుత్వంలో నియమితులైన వారేనని ఆమె గుర్తు చేశారు. మైనారిటీలకు తమ ప్రభుత్వం రక్షణ ఇవ్వదంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కాశ్మీర్‌కు చెందిన ఒక విద్యార్థి ఎక్బాల్ రసూల్ ఉపకార వేతనం సమస్యను తాను ఎలా పరిష్కరించిందీ వివరించారు. ప్రతి సభ్యుడు చేసిన ఆరోపణకు నావద్ద సమాధానం ఉంది. మీరు ఓపికగా వింటే చాలు అంటూ ఆవేశంతో అన్నారు. విద్యార్థులతో రాజకీయం చేయటం మానుకోవాలని హితవు పలికారు. విద్యారంగాన్ని రాజకీయం చేసి నాపై నిరాధార ఆరోపణలు చేశారు. ఇప్పుడు సమాధానమిస్తుంటే వెళ్లిపోతారా? అని నిలదీశారు. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే శిలువెక్కిస్తారా? అంటూ జ్యోతిరాధిత్య సింధియా, శశిథరూర్, అసదుద్దీన్ ఓవైసీ, పప్పుయాదవ్ తదితర నేతలను ఆగ్రహంతో ప్రశ్నించారు. నా పేరు స్మృతి ఇరానీ. మీకు సవాల్ చేస్తున్నాను. నా కులమేంటో మీరు చెప్పగలరా? అంటూ ఆమె ప్రతిపక్షాన్ని నిలదీశారు. కులం, మతం పేరిట తానెప్పుడూ పని చేయలేదని ఆవేశంతో ప్రకటించారు.
కెసిఆర్ బిజీగా ఉన్నారట
రోహిత్ ఆత్మహత్య వివరాలు తెలియగానే తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావుకు తాను టెలిఫోన్ చేస్తే ఆయన తీరిక లేకుండా ఉన్నారని సమాధానం వచ్చిందన్నారు. ఈ కాల్‌కు సంబంధించిన రికార్డు తనవద్ద ఉందంటూ స్మృతి వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసేందుకు టెలిఫోన్ చేశాను. కానీ ఆయన మాట్లాడలేదన్నారు. కెసిఆర్ ఈరోజు వరకూ తనకు అందుబాటులోకి రాలేదన్నారు. కెసిఆర్ కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు కవితకూ టెలిఫోన్ చేశానని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. రోహిత్ ఆత్మహత్యపై స్థానిక పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం అతని గది తెరిచి ఉందన్నారు. రోహిత్ తన లేఖలో తన మరణానికి ఎవ్వరూ కారణం కాదని రాశాడని వివరించారు. ఈ సందర్భంలో తెరాస పక్షం నాయకుడు జతేందర్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. దానికి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ రోహిత్‌ను వైద్యుల వద్దకు తీసుకుపోయేందుకు అనుమతించలేదని తెలంగాణ పోలీసులు చెప్పారని గుర్తు చేశారు. రోహిత్ మరణించాడని ఎవరు ప్రకటించారు? వైద్యులా? లేక రాజకీయం చేయాలనుకుంటున్న విద్యార్థులా? అని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒకేచోటికి రెండుసార్లు ఎప్పుడైనా వెళ్లారా? లేదే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు మరణిస్తే రాహుల్ వెళ్లలేదు. కానీ రోహిత్ వద్దకు రెండుసార్లు వెళ్లడంలో ఆయన రాజకీయ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఉమర్ ఖలీద్ కవితా పఠనానికి జెఎన్‌యులో హాల్ బుక్‌చేసి అఫ్జల్ గురు సంస్మరణార్థం సభ నిర్వహించారన్నారు. అఫ్జల్ గురు, మక్బూల్ భట్ జిందాబాద్, కాశ్మీర్‌కు స్వాతంత్రం కావాలి, ఇండియా గోబ్యాక్, భారత సైన్యం ముర్దాబాద్ అంటూ ఆ విద్యార్థులు నినాదాలిచ్చారన్నారు. భారత దేశం నాశనం కావాలంటూ నినాదాలిచ్చే వారిని సహించాలా? అని స్మృతి ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయ వ్యవస్థను పని చేయనివ్వండి. బాధితులకు న్యాయం కలుగుతుందని స్మృతి ఇరానీ ప్రకటించారు.