జాతీయ వార్తలు

రోహిత్ ఆత్మహత్యపై రాజ్యసభలో దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై దర్యాపునకు మానవ వనరుల శాఖ నియమించిన జ్యుడీషియరీ కమిటీలో దళిత సభ్యుడు లేడంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభను స్తంభింపచేసింది. బిఎస్పీ సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజ్యసభ దద్దరిల్లింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిస్తూ, రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాలని 8 మంది బిఎస్పీ సభ్యులు పోడియం వద్దకు చేరారు. దీంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను ఐదుసార్లు వాయిదా వేశారు. తరువాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే ఉపాధ్యక్షుడు పిజె కురియన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించారు. తరువాత జీరో అవర్ నిర్వహణకు ఉపక్రమిస్తుండగానే బిఎస్పీ అధినేత్రి మాయావతి లేచి రోహిత్ వేముల ఆత్మహత్యను ప్రస్తావించారు. దర్తాప్తు సంఘంలో ఎందుకు దళితులను సభ్యులుగా నియమించలేదని నిలదీశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆరెస్సెస్ సిద్ధాంతాలను విద్యార్థులపై రుద్దుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఇంతకుముందు కూడా వేధింపులు భరించలేని దళిత విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ వర్శిటీలో దళితులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి లేచి రోహిత్ అంశంపై మధ్యాహ్నం చర్చ జరుగనుంది కనుక, మాయావతి అప్పుడు మాట్లాడొచ్చని సూచించారు. ఆమెను ఆపేందుకు ఉపాధ్యక్షుడు కురియన్ సైతం ప్రయత్నించాడు. కానీ ఆమె ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణకు ఆదేశించాలని, దర్యాప్తు కమిటీలో దళితుడిని సభ్యుడుగా నియమించాలని మాయ డిమాండ్ చేశారు. హైదరాబాద్ వర్శిటీ వైస్ చాన్సలర్‌ను సస్పెండ్ చేయాలని పదే పదే డిమాండ్ చేశారు. సభను ఎందుకిలా గందరగోళ పరుస్తున్నారని కురియన్ పలుమార్లు ప్రశ్నించారు. ప్రభుత్వ సమాధానం రానంతవరకూ సభ ముందుకెళ్లేది లేదని బిఎస్పీ సీనియర్ నేత సతీష్‌చంద్ర మిశ్ర స్పష్టం చేశారు. దర్యాప్తు సంఘంలో దళితుడిని నియమిస్తారా లేదా అన్న మాయావతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి పట్టుబట్టారు. దర్యాప్తు సంఘంలో దళితుడు సభ్యుడుగా ఉండాల్సిందేనని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై చర్చ ప్రారంభించేందుకు తనకు అభ్యంతరం లేదని మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. విద్యార్థులను రాజకీయం కోసం ఉపయోగించుకోవద్దని ఆమె సూచించటం వివాదాస్పమైంది.
chitram..
రాజ్యసభలో మాట్లాడుతున్న మాయావతి

వాక్స్వాతంత్య్రానికీ హద్దులుంటాయ
రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: విద్యార్థులకు వాక్స్వాతంత్య్రం ఉండాల్సిందే, అయితే దానికి ఒక హద్దు ఉండటం అనేది అత్యంత ముఖ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్‌సభలో హైదరాబాద్, జెఎన్‌యు విశ్వవిద్యాలయాల్లో ఇటీవల జరిగిన సంఘటనలపై జరిగిన చర్చలో రాజ్‌నాథ్ పాల్గొంటూ విద్యార్థులు లేదా మరెవరైనా వాక్స్వాతంత్య్రానికి ఉండే హద్దు మీరితే సభ్య సమాజం హర్షించదని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తును కోర్టులు పరిశీలిస్తాయని ఆయన చెప్పారు. నిర్దోషులైన విద్యార్థులను వేధించేందుకు పోలీసులకు ఎలాంటి అనుమతి ఉండదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పాటియాల కోర్టులో న్యాయవాదులు వ్యవహరించిన తీరుపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

జెఎన్‌యులో కొందరు ఇచ్చిన నినాదాలను ఎవరూ సహించరని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. తాను ఏం చెప్పినా ఆలోచించి చెబుతానని, శపథం తీసుకున్నాను కాబట్టి అన్ని విషయాలను బైట పెట్టలేనని ఆయన తెలిపారు. దేశద్రోహం ఆరోపణ చేయాలా? వద్దా? అనేది పోలీసులు, కోర్టులు చూసుకుంటాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు సంఘటనలపై మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇచ్చిన వివరణ లోక్‌సభ సభ్యుల కళ్లు తెరిపించాలన్నారు. సమర్థవంతమైన సమాధానం ఇచ్చినందుకు ఆయన స్మృతి ఇరానీని అభినందించారు.

నేడు సంజయ్‌దత్ విడుదల
వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్

పుణె/ముంబయి, ఫిబ్రవరి 24: చివరి నిమిషంలో ఎలాంటి చిక్కులు ఎదురుకాని పక్షంలో 1993 నాటి ముంబయి పేలుళ్ల కేసులో శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని గురువారం పుణెలోని ఎరవాడ జైలునుంచి విడుదల కానున్నారు. సత్ప్రవర్తన కారణంగా సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు విధించిన అయిదేళ్ల శిక్షలో కొంత తగ్గించడంతో ఆయన గురువారం విడుదలవుతున్నారు. అయితే 42 నెలలు జైల్లో గడిపిన తర్వాత విడుదలవుతున్న సంజయ్‌దత్‌ను ప్రత్యేకంగా చూడడం జరుగుతోందని ఆరోపిస్తూ గురువారం బొంబాయి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. సత్ప్రవర్తన కాలంగా సంజయ్‌దత్‌కు లభించిన 8 నెలల 16 రోజుల శిక్ష తగ్గింపును లెక్కలోకి తీసుకున్న తర్వాత ఆయన ఈ నెల 25న తన జైలుశిక్షను పూర్తి చేసుకోనున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి రామ్ షిండే మంగళవారం చెప్పారు. సంజయ్‌దత్‌ను గురువారం విడుదల చేస్తారని జైలు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే సంజయ్‌దత్‌కు అక్రమంగా శిక్షనుంచి మినహాయింపు లభిస్తోందని, జైలు అదికారులు ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారని, కోరినదే తడవుగా పెరోల్ ఇవ్వడం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. జైలు నిబంధనలు, మాన్యువల్ ప్రకారం సంజయ్‌దత్‌కు ఇచ్చిన శిక్ష తగ్గింపును లెక్కవేయడం జరిగిందని దత్ తరఫు లాయర్లు అంటున్నారు. శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న ప్రతి ఖైదీకి వర్తించే మామూలు నిబంధనల ప్రకారం సంజయ్ దత్‌ను గురువారం ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు ఎరవాడ జైలు సూపరింటెండెంట్ యుటి పవార్ చెప్పారు. సెలబ్రిటీ అయిన కారణంగా దత్‌కు జైలు అధికారులు ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చుతూ, జైలు నిబంధనలకు అనుగుణంగానే ఆయనకు శిక్షలో మినహాయింపు ఇవ్వడం జరిగిందని, మిగతా అందరు నేరస్థుల్లాగానే ఆయననూ చూడడం జరిగిందని పవార్ చెప్పారు.
కాగా, సంజయ్ దత్ శిక్షలో మినహాయింపు ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు దత్‌కు విధించిన అయిదేళ్ల పూర్తి శిక్షా కాలాన్ని పూర్తి చేయడానికి ఆయనను తిరిగి అరెస్టు చేయాలని సామాజిక ఉద్యమ నేత ప్రదీప్ భలేకర్ దాఖలు చేసిన పిల్‌లో కోరారు. ‘చిన్న చిన్న నేరాలు చేసి సంవత్సరాల తరబడి జైలు గదుల్లో మగ్గిపోతున్న ఇతరుల మాటేమిటి? తమకు కూడా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి దరఖాస్తులపై ఎలాంటి ఆదేశాలు లేవు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది నితిన్ సత్పుతే చెప్పారు. తాను రేపు సంబంధిత ధర్మాసనం ముందు పిల్‌ను ప్రతిపాదించనున్నట్లు ఆయన చెప్పారు.
1993 మార్చిలో ముంబయిలో జరిగిన వరస పేలుళ్లకు ముందు భారత్‌లోకి వచ్చిన ఆయుధాలు, మందుగుండులో భాగమైన ఒక ఎకె-46 రైఫిల్‌ను కలిగి ఉన్నాడన్న ఆరోపణపై సంజయ్‌దత్‌ను 1993 ఏప్రిల్ 19న అరెస్టు చేయడం తెలిసిందే. సుదీర్ఘంగా జరిగిన దర్యాప్తు, కేసు విచారణ సందర్భంగా ఆయన 18 నెలల పాటు జైల్లో ఉన్నారు.