జాతీయ వార్తలు

రోహిత్ సోదరుడికి ఢిల్లీ ప్రభుత్వంలో ఉద్యోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దళిత స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. తన రెండో కుమారుడు రాజాకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ఆమె కోరారు. ఆమెతోపాటు చిన్న కుమారుడు రాజా, అతని మిత్రులు కేజ్రీవాల్‌ను కలిసినవారిలో ఉన్నారు. రాధిక విజ్ఞప్తికి ఢిల్లీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రోహిత్ సోదరుడు రాజాకు ఢిల్లీ ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయంచారు.
‘సుజనా, లగడపాటిని వదిలేసి.. రైతులకు వేధింపులా?’
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రైతుల రుణలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావులేఖ రాశారు. బ్యాంకులను వేలాది కోట్లు మోసం చేసిన బడా పారిశ్రమికవేత్తలు ముఖ్యంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటి వారిని వదిలేసి బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విహెచ్ అన్నారు. విహెచ్ బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ముందు బాడాబాబులను పట్టుకోవాలని సూచించారు. రుణాలను ఎగవేసిన పారిశ్రమికవేత్తలపై కేంద్రం చర్యలు తీసుకోకుంటే రైతులు కనె్నర్ర చేసే అవకాశం ఉందన్నారు. తరువాత ప్రభుత్వం, బ్యాంకులపై తిరుగుబాటు చేసే అవకాశం తప్పదని హెచ్చరించారు.

వ్యతిరేక నినాదాలిచ్చినవారు
దేశ ద్రోహులు కారా?

రాహుల్‌ను నిలదీసిన అమిత్ షా ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దని హితవు

బహ్రైచ్, ఫిబ్రవరి 24: భావ స్వేచ్ఛ పేరిట దేశ వ్యతిరేక నినాదాలు చేయడాన్ని సహించాలో లేదో ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో స్పష్టం చేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బుధవారం డిమాండ్ చేశారు. జెఎన్‌యు విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో పాలుపంచుకున్నందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆయన దేశాన్ని చీల్చే శక్తులకు మద్దతు ఇస్తున్నారని షా అన్నారు. ‘అఫ్జల్ గురు తేరే హత్యారే జిందా హై’, ‘్భరత్ కే తుకడే హోంగే’లాంటి నినాదాలు చేసిన వారు దేశ ద్రోహులా కాదో చెప్పాలని నేను ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ కార్యకర్తలను అడుగుతున్నాను’ అని బుధవారం ఇక్కడ 11వ శతాబ్దంనాటి షారావస్తి రాజు రాజా సుహేల్ దేవ్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ అమిత్ షా అన్నారు. ‘దేశ వ్యతిరేక నినాదాలు చేయడం భావ స్వేచ్ఛో లేక దేశ ద్రోహమో దేశంలోనే అతి పెద్ద పంచాయత్ అయిన పార్లమెంటులో కూర్చుని ఉన్న అన్ని పార్టీల నేతలు చెప్పాలని నేను కోరుతున్నారు. ఈ దేశ ప్రజలు ఈ విషయాన్ని నిర్ణయించాలి’ అని ఆయన అన్నారు. సుషేల్ దేవ్ దేశానికి చేసిన సేవలను షా ప్రస్తావిస్తూ, ఉత్తరప్రదేశ్ ప్రజలే కాకుండా దేశం యావత్తూ ఆయన గురించి గర్వంగా చెప్పుకొంటోందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం అంతగా దిగజారి పోవద్దని అన్నారు. ‘వేలాది మంది అమరవీరుల త్యాగ ఫలితంగా దేశం స్వాతంత్య్రం పొందింది. ఇప్పుడు మీరు భావ స్వేచ్ఛ పేరుతో దేశాన్ని చీలుస్తున్న శక్తులను సమర్థిస్తున్నారు’ అని ఆయన అన్నారు.