అంతర్జాతీయం

భారత్‌లో పెరిగిన అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: భారత్‌లో అసహనం పెరిగిపోతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బుధవారం ఇక్కడ విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు అనేక మతపరమైన హింసాత్మక సంఘటనలను నివారించడంలో విఫలమయ్యారని, కొన్నిసార్లు తమ విచ్ఛిన్నకర ఉపన్యాసాల ద్వారా ఉద్రిక్తతలకు కారకులయ్యారని అంతర్జాతీయ హక్కుల సంఘం తన 2015-16 వార్షిక నివేదికలో పేర్కొంది. భారత్‌లో స్వేచ్ఛలను అణచివేయడంసహా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు అంతర్జాతీయ న్యాయానికి భంగం కలిగిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెచ్చరించింది. భారత్‌లో పెరుగుతున్న అసహన వాతావరణానికి వ్యతిరేకంగా అనేకమంది కళాకారులు, రచయితలు, శాస్తవ్రేత్తలు తమ జాతీయ పురస్కారాలను వాపసు చేశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే పౌర సమాజ సంస్థలను అణచివేశారని, విదేశీ విరాళాల స్వీకరణపై ఆంక్షలను పెంచారని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయని, లింగపరమైన, కులపరమైన వివక్ష, హింస వ్యాప్తి చెందిందని పేర్కొంది.
భావప్రకటన స్వేచ్ఛపై అతివాద హిందూ సంస్థల ఆంక్షలు, దాడులు పెరిగాయని తెలిపింది. ‘2015లో భారత్‌లో అనేకసార్లు మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ప్రభుత్వం పౌర సమాజ సంస్థలపై ఆంక్షలను తీవ్రం చేసింది’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకార్ పటేల్ తెలిపారు. భారత్‌లో 2014లో మహిళలపై సుమారు 3,22,000 నేరాలు జరిగాయని, ఇందులో 37,000 రేప్ కేసులు ఉన్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.