జాతీయ వార్తలు

వసతులకు సై సామాన్యుడికి జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత, కోత లేని రైలు కూత
జనరంజకంగా సురేశ్ ప్రభు బడ్జెట్

జనరంజకం..సామాజిక ప్రయోజనం వెరసి సురేశ్ ప్రభు కొత్త రైల్వే బడ్జెట్. ప్రయాణ, రవాణ చార్జీల జోలికి పోకుండా ఆచితూచి 2016-17 రైలును
పట్టాలెక్కించారు. ఇందులో ప్రయాణికుల సౌకర్యాలకు కొదవ లేదు. కొత్త రైళ్లకు అంతకంటే దిగుల్లేదు. మహిళల భద్రతకు, సీనియర్ సిటిజన్ల అవసరాలకు పెద్దపీట వేశారు. రైళ్లను సూపర్ ట్రాక్ ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఖర్చును తగ్గించుకుంటూ..ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టారు. దక్షిణాదిన చెన్నైలో తొలి రైలు ఆటో హబ్ నిర్మాణ ప్రతిపాదన చేశారు.
మూడేళ్లలో ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ, తూర్పు తీర రవాణా కారిడార్ల నిర్మాణానికి తెరతీశారు. కొత్త వాటి జోలికి పోకుండా ఉన్న ప్రాజెక్టుల
పూర్తికే ప్రాధాన్యత నిచ్చారు. కొత్తగా ప్రకటించిన మూడు సూపర్ ఫాస్ట్
రైళ్ల వేగం గంటకు 130 కిలోమీటర్లు. రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం అంత్యోదయ సూపర్ ఫాస్ట్‌ను ప్రవేశ పెట్టారు. రైళ్లలోనే మొబైల్ ఫోన్ల చార్జింగ్ అవకాశాల్ని మరింతగా పెంచారు. కొత్త ప్రతిపాదనల ఆధారంగా
కొత్త ఆర్థిక సంవత్సరంలో 1,84,820 కోట్ల రూపాయల
రెవిన్యూ ఆర్జనే లక్ష్యంగా సురేశ్ ప్రభు బండి కదిలింది.

అభివృద్ధి, దూరదృష్టి
మేలుకలయిక ఈ బడ్జెట్.
వౌలిక సదుపాయాలకు,
ఉపాధి కల్పనకు వెన్నుదన్ను
- ప్రధాని నరేంద్ర మోదీ

సామాన్యుడి ప్రయోజనాలకు
పెద్దపీట. భవిష్యత్‌లో మరిన్ని
సౌకర్యాలు విస్తరిస్తాం
- రైల్వే మంత్రి సురేశ్ ప్రభు

కొత్త బడ్జెట్‌లో
ప్రజలకు లభించేది బులెట్లా లేక బులెట్ రైళ్లా అన్నది ఇప్పుడే చెప్పలేం
- మల్లికార్జున్ ఖర్గే
లోక్‌సభలో కాంగ్రెస్ నేత

ప్రయాణికుల
సౌకర్యాలకు పెద్దపీట
1,84,820 కోట్ల ఆదాయం లక్ష్యం
రెండు రవాణా కారిడార్ల నిర్మాణం
ఖరగ్‌పూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్
చెన్నై కేంద్రంగా రైల్వే ఆటో హబ్
సీనియర్ సిటిజన్లకు మరింత వెసులుబాటు
హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ సూపర్ ఫాస్ట్ రైళ్లు
వచ్చే నెల్లోనే బులెట్ రైల్ ఒప్పందం
వడోదరలో రైల్వే వర్శిటీ
కోచ్‌లలో కోరిన స్థానిక భోజనం
పిల్లలకు వేడి నీళ్లు, పాలు
మహిళల భద్రతకు
మరింత ప్రాధాన్యం
రైల్వే బోర్డు
పునర్వ్యవస్థీకరణ