జాతీయ వార్తలు

నెహ్రూ, ఇందిర సేవలను విస్మరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ నెహ్రూ చిత్రపటం లేకుండా ప్రకటనలు విడుదల చేసిన స్ర్తి శిశు సంక్షేమ అభివృద్ధి శాఖపైనా, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నాడు ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయని దూరదర్శన్ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారా లేక తెలియక ఈ తప్పు చేశారా? అన్న విషయంపై సమగ్ర విచారణకు ఆదేశించి భవిష్యత్తులో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
నెహ్రూ, ఇందిర ఈ దేశానికి అందించిన సేవలను విస్మరించటానికి వీలులేదని ఆయన గుర్తుచేశారు. వీరిని పక్కన పెట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేసేవారికి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదన్న నిజాన్ని గ్రహించి పాలకులు వ్యవహరించాలని హనుమంతరావు సూచించారు.

లిబియా కిడ్నాపర్ల చెర నుండి విడిపించండి’

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: లిబియాలో కిడ్నాపై ఇంతవరకూ విడుదల కాని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరి వ్యక్తుల ఆచూకీ తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా తెలుగుదేశం ఎంపీ కింజారపురామ్‌మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన ఒక తీర్మానం ప్రతిపాదించారు. జూలైలో అపహరణకు గురైన నలుగురిలో ఇద్దరు విడుదలకాగా, మిగిలిన ఇద్దరి ఆచూకీ ఇంతవరకూ తెలియకపోవటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆయన చెప్పారు. ఉపాధికోసం విదేశాలకు వెళ్లేవారికి ఏ విధమైన సమస్యలు రాకుండా చూడటానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.