జాతీయ వార్తలు

చార్జీల మోత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చార్జీల మోత మోగలేదు... కొత్త ప్రాజెక్టుల ఊసు లేదు.. భారీగా నిధుల కేటాయింపులు జరగలేదు. అయితేనేం... ప్రయాణికుల సౌకర్యాలకు అగ్ర తాంబూలమిచ్చారు. అదనపు వసతులకు పెద్దపీట వేశారు. తద్వారా ‘ఆమ్ ఆద్మీ’ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆచి తూచి రూపకల్పన చేసిన బడ్జెట్ సారాంశమిది.
ఉదయం 11.50 గంటలకు లోక్‌సభలో అడుగుపెట్టిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 12.05కు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. తొలుత రైల్వే మంత్రిగా తన అనుభవాలను వివరించిన ఆయన, బడ్జెట్ వివరాల్లోకి వెడుతూ నవ్ ఆర్జన్, నవ్ మానక్, నవ్ సన్చ్న్రా (కొత్త ఆదాయ మార్గాలు, కొత్త విధానాలు, కొత్త వ్యవస్థ) అనే మూడు లక్ష్యాలే పునాదిగా బడ్జెట్‌ను రూపొందించినట్టు చెప్పారు. బడ్జెట్ తయారీలో ప్రధానంగా దేశ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకున్నామన్నారు. దేశంలోని లక్షలాదిమంది ప్రయాణికులను స్పృశిస్తూ బడ్జెట్ ప్రయాణం సాగిందన్నారు. గంటసేపు సుదీర్ఘంగా సాగిన ఆయన ప్రసంగంలో ప్రయాణికుల కోసం ఉద్దేశించిన కొత్త పథకాలు, సౌకర్యాలపైనే ప్రధానంగా మాట్లాడారు.
రూపాయి ఖర్చుతో ఐదు రూపాయల వృద్ధి సాధించేందుకు చర్యలు చేపడుతున్నామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన 139 అంశాల్లో కార్యాచరణ ప్రారంభించామన్నారు. 2016-17 సంవత్సరానికి 1,84,820 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. చెన్నై కేంద్రంగా రైల్వే ఆటో హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వడోదరలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్వేని పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఖరగ్‌పూర్- విజయవాడ ట్రేడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
‘అన్ని రైళ్లలోనూ 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేశాం. వయో వృద్ధులకు కింద బెర్త్‌ల రిజర్వేషన్ కోటాను పెంచాం. మూడు కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్ళు... పూర్తిస్థాయి ఎయిర్ కండిషన్డ్ (త్రీ టయర్) ‘హమ్ సఫర్’, ఆధునిక రైళ్లకు అద్దం పట్టే ‘తేజస్’, డబుల్ డెక్కర్ రైల్ ‘ఉదయ్’లను ప్రవేశపెడుతున్నామ’ని రైల్వే మంత్రి ప్రకటించారు. సరుకు రవాణా సమర్థ నిర్వహణకోసం రెండు కారిడార్లను 2019లోకి నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం ఆంత్యోదయ ఎక్స్‌ప్రెస్, దీన్‌దయాళ్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రైల్వే వ్యవస్థను డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే పథకాల కోసం ఒక లక్షా ఇరవై ఒక్క కోట్ల పెట్టుబడులతో బడ్జెట్‌ను సిద్ధం చేశామంటూ రాష్ట్రాలతో జాయింట్ వెంచర్లు, పిపిపి విధానంతోపాటు కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. 2015-16లో 8,720 కోట్లను ఆదా చేయగలిగామంటూ దీని ద్వారా తమ ఆదాయ లోటును దాదాపు 90 శాతం భర్తీ చేసుకోగలిగామని చెప్పారు. రైల్వే ఉద్యోగుల పింఛన్ల కోసం 45 వేల కోట్లు కేటాయించామన్నారు. ఏడవ వేతన సవరణ అమలు చేసేందుకు కూడా కేటాయింపులు జరిపామని చెప్పారు. ‘అడగగానే రిజర్వేషన్ లభించేలా చర్యలు తీసుకుంటాం. సరకు రవాణాకు టైం టేబుల్ నిర్ణయిస్తాం. అన్‌మాన్డ్ లెవల్ క్రాసింగులను పూర్తిగా తొలగిస్తాం. రైళ్ల సమయ పాలనకు గట్టి చర్యలు తీసుకుంటాం. దాదాపు 400 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పిస్తాం. రైళ్ల వేగం పెంచుతాం’ అంటూ సురేశ్ ప్రభు వివరించారు.
బుల్లెట్ ట్రెయిన్ కోసం జపాన్‌తో ఒప్పందం
అహ్మదాబాద్- ముంబాయి బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణం కోసం జపాన్‌తో ఈ నెలలోనే ఒప్పందం చేసుకోబోతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం రెండు వేల కిలోమీటర్ల రైల్ రూట్‌ను విద్యుదీకరిస్తామన్నారు. ప్రయాణికుల చార్జీలపై రాయితీలు ఇవ్వటం వలన రైల్వేకు సాలీనా 30 వేల కోట్ల నష్టం సంభవిస్తోందన్నారు. రైల్వే బోర్టును పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రైళ్లలో బయో వ్యాక్యూం టాయ్‌లెట్లు ప్రవేశపెడుతున్నామనీ, తమ కోచ్‌ను శుభ్రపరచాలంటూ ఇకపై ప్రయాణికులు ఎస్సెమ్మెస్ ద్వారా డిమాండ్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. రైళ్లలో చిన్న పిల్లలకు అవసరమైన బేబీ ఫుడ్, వేడి నీళ్లు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. రైల్వే శాఖ వివిధ పథకాల ద్వారా వచ్చే సంవత్సరం తొమ్మిది కోట్ల పని దినాలు, ఆ పై సంవత్సరం 14 కోట్ల పని దినాలను సృష్టస్తున్నట్లు ప్రభు చెప్పారు. వంద రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు చేయటం ద్వారా ఆధునీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. తదుపరి దశలో మరో 400 స్టేషన్లను ఈ పథకం పరిధిలోకి తెస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు లోకో కార్మాగారాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు అదనంగా 65 వేల బెర్త్‌లను ఏర్పాటు చేయటంతోపాటు 2,500 మంచినీటి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైళ్లలో 17 వేల బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, రైళ్ళలో భద్రత పెంచేందుకు సిసి టివిలను ఏర్పాటు చేస్తామన్నారు. టికెట్లను చేతి యంత్రాల ద్వారా విక్రయించటంతోపాటు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ల విక్రయానికీ అనుమతి ఇస్తామన్నారు. పత్రికా విలేఖరులు ఇకమీదట తమ రాయితీ టికెట్లను రైల్వే వెబ్‌సైట్లో కొనుగోలు చేసేందుకు వీలు కల్పించారు. తిరుపతితోపాటు పలు తీర్థయాత్రా క్షేత్రాల రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించటంతోపాటు ఆస్తా రైళ్లను నడిపిస్తామన్నారు. రైళ్లలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల సౌకర్యం కల్పిస్తామని ప్రభు హామీ ఇచ్చారు.

రైల్వే అభివృద్ధి అథారిటీ ఏర్పాటు
రైల్వే సేవల చార్జీలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూడటం, పోటీతత్వాన్ని పెంచటం, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటం వంటి లక్ష్యాలను సాధించేందుకు రైల్ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సురేష్ ప్రభు తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లు సిద్ధమవుతోందన్నారు. నవీకరణం, సశక్తీకరణం, ఏకీకరణం, ఆత్మపరిశీలన, పరిశోధన, విశే్లషణ ద్వారా రైల్వే వ్యవస్థలో కొత్త యుగాన్ని ప్రారంభిస్తున్నామని ప్రభు ప్రకటించారు. భారత రైల్వే వ్యవస్థను సమూలంగా మార్చివేసేందుకు ఏడు మిషన్‌లను ప్రారంభిస్తున్నామన్నారు. రైల్వే శాఖకు సంబంధించిన అన్ని ఆస్తులనూ సమర్థ నిర్వహణ కోసం ఒక హోల్డింగ్ కంపెనీ పరిధిలోకి తెస్తున్నామని మంత్రి చెప్పారు. దీర్ఘకాలిక పరిశోధన కోసం ఒక ఆర్‌ఆండ్‌డి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.