జాతీయ వార్తలు

జెపిసి పనితీరుపై మరో కమిటీనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పార్లమెంట్ సభ్యుల జీతాల పెంపునకు సంబంధించిన అన్ని అంశాలపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించటానికి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సభ్యులతో ఏర్పాటైన సంఘం (జెపిసి) పని తీరును పర్యవేక్షించటానికి ప్రభుత్వం మరో కమిషన్ వేసిందంటూ ప్రతిపక్షాలు రాజ్యసభలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. సభలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తమ అనుమానాలను నివృతి చేయాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ ఫలించలేదు. ఉభయ సభల అధిపతులు నియమించిన కమిటీపై పర్యవేక్షణకు మరో కమిటీని ఎవరు నియమించారు? ఈ అధికారం ఎవరికి ఉంది? ఒకవేళ మరో కమిటీ ఎర్పడి ఉంటే అది సభను కించపరచటం కాదా? అని సమాజ్‌వాదీ సభ్యుడు నరేష్ అగర్వాల్ ప్రశ్నించారు. జెపిసిని పర్యవేక్షించటానికి మరో కమిటీ ఏర్పడినట్లు పత్రికలలో వచ్చిన వార్తలను చూసి లేనిపోని అపోహలు తెచ్చుకోవద్దని డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ్యులకు సూచించారు.