జాతీయ వార్తలు

13 రాష్ట్రాలకు వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పట్టణాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతోపాటు వాటి స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయడానికి ఉద్దేశించిన అమృత్ పథకం కింద మొదటి విడతగా కేంద్రం 13 రాష్ట్రాలకు వెయ్యి కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో అన్ని గృహాలకు తాగునీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో 13 రాష్ట్రాలకు రూ.1,062.27 కోట్ల రూపాయలను విడుదల చేసిందని బుధవారం ఇక్కడ విడుదల చేసిన ఒక అధికార ప్రకటన తెలిపింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 13 రాష్ట్రాల్లోని 286 నగరాలకుగాను మొత్తం 11,671.76 కోట్ల రూపాయల విలువైన అటల్ మిషన్ కార్యాచరణ పథకాలను కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ 13 రాష్ట్రాలకు హామీ ఇచ్చిన మొత్తం 5,311.38 కోట్ల రూపాయల కేంద్ర సాయంలో భాగంగా ఈ మొత్తం విడుదల చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది. కేంద్రం నిధులు విడుదల చేసిన 13 రాష్ట్రాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, చత్తీస్‌గఢ్, ఒడిశా, హర్యానా, తెలంగాణ, జార్ఖండ్, మిజోరం రాష్ట్రాలున్నాయి. 286 నగరాలకు సంబంధించి మొత్తం 989 ప్రాజెక్టులను తమ మంత్రిత్వ శాఖ ఆమోదించిందని, వీటిలో చాలాభాగం తాగు నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలకు సంబంధించినవని కూడా పట్టణాభివృద్ధి శాఖ తెలియజేసింది.
దేశవ్యాప్తంగా 500 మిషన్ నగరాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలు ఉండేలా చూడడంతోపాటుగా ప్రాధాన్యతా క్రమంలో ప్రతిరోజూ తలసరి 135 లీటర్ల తాగునీటిని సరఫరా చేయడం గత జూన్‌లో ప్రారంభించిన అటల్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద వరద నీటి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టడంతోపాటు పట్టణాల్లో కాలుష్యానికి కారణం కాని వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పార్కులు, పచ్చదనాన్ని పెంపొందించే పథకాలు లాంటి వాటికి కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఆ ప్రకటన తెలిపింది.