జాతీయ వార్తలు

స్పీకర్‌కు కోపమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరుపట్ల స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర అవహనానికి గురయ్యారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షలకు చెందిన సభ్యులు బుధవారం లోక్‌సభ పోడియం వద్దకు వచ్చి నినాదాలిస్తూ గొడవ చేయటంతోపాటు, తనను విమర్శించటం పట్ల సుమిత్రా మహాజన్ జీరో అవర్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. మీ గొడవను భరించలేకే సభా హక్కుల తీర్మానంపై నిబంధనలను విరుద్ధంగా అవకాశం ఇవ్వవలసి వస్తోంది, ఇది మంచి విధానం కాదు, ఇకమీదట ఇలాంటి అవకాశం ఇవ్వటం సాధ్యం కాదని ఆమె నిష్కర్షగా చెప్పారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై తామిచ్చిన సభా హక్కుల తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన సభ్యులు బుధవారం లోక్‌సభను స్తంభింపజేశారు.
ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే కాంగ్రెస్, టిఎంసి, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చి స్మృతి ఇరానీపై తామిచ్చిన సభా హక్కుల తీర్మానాన్ని ఏం చేశారంటూ నిలదీశారు. అయితే స్పీకర్ ఇవేమీ పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ సుమిత్రా మహాజన్ మాత్రం సభను వాయిదా వేయకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమంపై చర్చ కొనసాగించారు. దీనికి ఆగ్రహించిన ప్రతిపక్ష సభ్యులు సుమిత్రా మహాజన్‌పై విమర్శలకు దిగారు. సభలో నిరంకుశత్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ గొడవ మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని పూర్తిచేశారు. పనె్నండు గంటలకు జీరో అవర్ చేపట్టకుండా తనపై విమర్శలు గుప్పించిన సభ్యుల తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరిలా మాట్లాడటం ఎంతమాత్రం న్యాయం కాదు, స్పీకర్‌ను విమర్శిస్తారా? ఏమిటీ విధానం అంటూ ప్రశ్నించారు. నియమ, నిబంధనల మేరకు సభను నడిపించాలా, వద్దా? అంటూ నిలదీశారు. మీరు డిమాండ్ చేయగానే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలా? మీ ఇష్టమున్నట్లు సభ జరగాలా? ఇది మంచి పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల తీర్మానంపై ఎప్పుడైనా చర్చించామా? సభ్యులు ఇచ్చిన సభా హక్కుల తీర్మానం తన పరిశీలనలో ఉన్నదని పలుమార్లు చెప్పినా వినిపించుకోరా అంటూ ప్రశ్నించారు. మీకు ఇష్టమున్నంతసేపు మాట్లాడండి, మీ మాటలకు నేను అడ్డుపడనంటూ హక్కుల తీర్మానం ప్రతిపాదనపై మాట్లాడేందుకు అనుమతించారు. హక్కుల తీర్మానం ప్రతిపాదించిన వారిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు వేణుగోపాల, సిపిఎం సభ్యుడు సలీం, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సౌగత్ రాయ్, రంజితా రంజన్ ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ప్రతిపక్షం సభ్యులు స్పీకర్‌ను విమర్శించటం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు.
స్పీకర్‌పై ప్రతిపక్షం చేసిన విమర్శలను రికార్డుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం... బుధవారం లోక్‌సభలో స్పీకర్ స్థానంలో సుమిత్రా మహాజన్. పోడియం వద్ద గొడవ చేస్తున్న ఎఐఎడిఎంకె సభ్యులు