జాతీయ వార్తలు

రాజ్యసభలో ‘వివక్ష’ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: మూడు రోజులపాటు సాఫీగా జరిగిన రాజ్యసభ సమావేశాలకు బుధవారం అవరోధం తప్పలేదు. సభా నాయకుడు అరుణ్ చైట్లీ చేసిన ప్రకటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు సభను స్తంభింపచేయటతో సమావేశాలకు గండిపడింది. ప్రశ్నోత్తరాలతోసహా ఏ ఇతర అంశాలను చేపట్టకుండా అనేకసార్లు వాయిదాపడిన సభ మధ్యాహ్నం మూడున్నర తరువాత వరదలపై చర్చతో తిరిగి ప్రారంభమైంది. ఉదయం పదకొండు గంటలకు మొదలైన సభ పదిహేను నిమిషాలపాటు ప్రశాంతంగా నడిచింది. డిప్యూటీ చైర్మన్ కురియన్ ఒక అంశాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండగా సభా నాయకుడు అరుణ్ జైట్లీ ఒక అతిముఖ్యమైన విషయాన్ని సభ దృష్టికి తీసుకురావటానినకి అనుమతి పొందారు. రాజ్యాంగంపై చర్చ జరిగిన సమయంలో గతంలో మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సభ్యురాలు గుజరాత్‌లోని ద్వారక మందిరాన్ని దర్శించటానికి వెళ్లినప్పుడు ఆలయ పూజారులు కులం గురించి అడిగి వివక్షత చూపించారని చేసిన ప్రకటన నిజం కాదని ఆయన బాంబు పేల్చారు. అంతేకాక ఆలయంలో తనకు లభించిన గౌరవ మర్యాదలు ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉన్న వాతావరణాన్ని ప్రశంసిస్తూ రాసిన లేఖను సభకు చూపించారు. మాజీ మంత్రి ఈ విధంగా గుజరాత్‌పై అభాండం వేయటానికే ఈ నిరాధారమైన ఆరోపణ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. జైట్లీ ప్రకటనపై దళితురాలైన మాజీ మంత్రి సెల్జా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వారకలోని ప్రధాన ఆలయంలో తనకు అవమానం ఎదురైనట్లు తన ప్రసంగంలో చెప్పలేదని, అయినప్పటికీ మీకు ఈ లేఖ ఏ దేవస్థానం నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈ లేఖ కృష్ణ దేవస్థానం నుంచి అందిందని జైట్లీ చెప్పగానే సెల్జా జైట్లీపై ఆవేశంతో ఎదురుదాడికి దిగారు. ద్వారకలోని ప్రధాన ఆలయంలో నాకు అవమానం జరిగిందని చేప్పలేదు. వాస్తవానికి ఆలయ ప్రధాన పురోహితులు నన్ను గౌరవప్రదంగా చూశారు. అయితే బేత అలయంలో తన కులాన్ని అడిగి వివక్షత చూపించారని తాను చెప్పిన మాటలను వక్రీకరించటం జైట్లీకి తగదని ఆమె ఉద్వేగంతో చెప్పారు. జైట్లీ వంటి ప్రముఖ పార్లమెంటరీయన్ సభ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించటం భావ్యం కాదని అరుస్తూ ఆమె వెల్‌లోకి దూసుకొచ్చారు. ఆమెకు మద్దతుగా మిగిలిన మహిళా సభ్యులు రంగంలోకి దిగారు.
కాంగ్రెస్ సభ్యులు జైట్లీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వాతావరణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుండటంతో కురియన్ రెండుసార్లు సభను వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాలను చేపట్టటానికి చైర్మన్ చేసిన ప్రయత్నాలు ఫలించక పోవటంతో ఆయన రెండుగంటల వరకూ సభను వాయిదా వేశారు.
chitram...
స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు