అంతర్జాతీయం

అమెరికా అధ్యక్ష బరిలో ఆ ఇద్దరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికోసం రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ మధ్య ముఖాముఖి పోటీ ఉంటుందనే విషయం దాదాపుగా ఖరారయింది. ‘మహామంగళవారం’గా అభివర్ణించిన నిన్న 12 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఈ ఇద్దరూ తిరుగులేని విజయాలు సాధించి ప్రత్యర్థులకందనంత ఆధిక్యతలో నిలవడంతో ఈ ఇద్దరి మధ్యనే ముఖాముఖి పోటీ ఉండే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీలోని మిగతా పోటీదారులనుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ రేసులో ముందున్న ట్రంప్ ప్రైమరీ ఎన్నికలు జరిగిన 12 రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు- అలబామా, ఆర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెనె్నస్సీ, వెర్మోంట్, వర్జీనియాలలో విజయం సాధించారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీలో అందరికన్నా ముందున్న, అలాగే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని కలలు కంటున్న 68 ఏళ్ల హిల్లరీ క్లింటన్ కూడా ఈ ప్రైమరీ ఎన్నికల్లో అలబామా, ఆర్కాన్సాస్, జార్జియా, మసాచుసెట్స్, టెనె్నస్సీ, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో విజయం సాధించారు. అమెరికాలోని నల్లజాతి ఓటర్లలో హిల్లరీ క్లింటన్‌కు భారీ మద్దతు లభించింది. అంతేకాదు 2008లో వర్జీనియా రాష్ట్రంలో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాకు పరాజయం ఎదురుకాగా, ఇప్పుడు అక్కడ ఆమె విజయం సాధించడం గమనార్హం.
అయితే చాలామంది రాజకీయ పండితులు అంచనా వేసినట్లుగా ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరు కూడా క్లీన్‌స్వీప్ సాధించలేక పోవడం గమనార్హం. రిపబ్లికన్ పార్టీ శిబిరంలో ట్రంప్ ప్రధాన ప్రత్యర్థి అయిన టెడ్ క్రుజ్ మంగళవారం ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన టెక్సాస్‌తో పాటుగా ఓక్లహోమా, అలాస్కా రాష్ట్రాల్లో విజయం సాధించగా, మార్కో రుబియో ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో తొలి విజయాన్ని మినె్నసోటాలో నమోదు చేశారు. డెమోక్రటిక్ పార్టీ శిబిరంలో హిల్లరీ క్లింటన్ ప్రధాన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ తన సొంత రాష్టమ్రైన వెర్మోంట్‌తోపాటుగా కొలరాడో, ఓక్లహామా, మినె్నసోటా రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత 69 ఏళ్ల ట్రంప్ ఈ ఏడాది చివర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధికార అభ్యర్థిగా నిలవడానికి మరింత చేరువయ్యారు. ‘ఈ ప్రైమరీ ఎన్నికలన్నీ ముగిసిన తర్వాత నేను ఒకే ఒక వ్యక్తిని ఎదుర్కోబోతున్నాను, అది హిల్లరీ క్లింటన్’ అని ఆయన ఫ్లోరిడా పామ్‌బీచ్‌లోని తన మార్-ఎ-లాగో రిసార్ట్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. హిల్లరీ క్లింటన్ సైతం ఇప్పటివరకు పార్టీలో తన ప్రధాన ప్రత్యర్థిగా ఉండిన శాండర్స్‌పై కాక ట్రంప్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం గమనార్హం.
‘మహా మంగళవారం’రోజున ఫ్లోరిడాలో మాట్లాడుతున్న డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్. కెంటకీలో మాట్లాడుతున్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్