ఆంధ్రప్రదేశ్‌

వైకాపా అవిశ్వాస అస్త్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆలస్యంగా మేల్కొన్న వైకాపా నేతలు అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా ఫిరాయింపుదారుల వలసలకు అడ్డుకట్టవేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండటంతో శాసనసభ వేదికగా ఫిరాయింపుదార్లకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న వైకాపా రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా పార్టీ సభ్యులు అందరికీ విప్‌ను జారీ చేయాలనేది పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం మరో విధంగా చెప్పాలంటే పార్టీ నుండి వలస వెళ్తున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకేననేది వ్యూహంగా చెబుతున్నారు. విప్‌ను ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే వైకాపా ఎమ్మెల్యేలను పార్టీ నుండి బహిష్కరించడం ద్వారా వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించాలని చూస్తోంది. వైకాపా తాజా వ్యూహాన్ని గమనించిన వలసవాదులు కాస్త వెనక్కు తగ్గినట్టు చెబుతున్నారు. బుధవారం కోడుమూరు నుండి వలస వెళ్లిన మణిగాంధీ సహా ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నెల 4వ తేదీన టిడిపిలో చేరనున్నట్టు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన వెంకటరమణ ఇప్పటికే ప్రకటించారు. ఆయనతో కలుపుకుంటే ఎనిమిది మంది టిడిపిలో చేరినట్టు అవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం బెడద లేకుండా చూడాలంటే కనీసం మూడింట రెండొంతుల మంది పార్టీని చీల్చాల్సి ఉంటుంది. ఆ విధంగా వైకాపా నుండి 67 మంది శాసనసభ్యుల్లో కనీసం 44 మంది తెలుగుదేశం పార్టీలో చేరితే వారిపై విప్‌లు లేదా ఇతర ఇబ్బందులు లేకుండా వారందర్ని టిడిపి సభ్యులుగా పరిగణించేందుకు వీలుంటుంది. కాని ఇంత వరకూ టిడిపిలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8 దాటలేదు. దాటుతుందనే అవకాశం కనిపించడం లేదు. ఈ 8 మందిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయించడానికి ఉన్న మార్గాలను వైకాపా నేతలు అనే్వషిస్తున్నారు. అందుకు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నారు. తద్వారా విప్‌ను ఉల్లంఘించిన వారి శాసనసభ్యత్వాలను రద్దు చేయమని కోరవచ్చనేది వైకాపా వ్యూహంగా ఉంది.
శాసనసభ సభ్యత్వం రద్దయినా, శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒకరికి మించి నాయకులు ఉన్నా ఎవరూ ఇబ్బంది పడాల్సిన పనే్లదని, మొత్తం నాయకులు అందర్నీ రానున్న ఎన్నికల్లో సర్దుబాటు చేసే వీలు కలుగుతుందని టిడిపి నాయకులు సర్దిచెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగుతాయని, దానివల్ల మరో 50 కొత్త నియోజకవర్గాలు రానున్నాయని, వాటిలో కొత్తగా చేరిన వారందరినీ సర్దుబాటు చేద్దామని సిఎం చంద్రబాబు వలస నేతలకు హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు తప్పకుండా శాసనసభ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను అని పార్టీలో కొత్తగా చేరుతున్న వారికి హామీ ఇస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో మరో వారంలో తేలిపోనుంది.