అంతర్జాతీయం

పేదరికం బారిన అమెరికా బాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: సంపన్నవంతమైన దేశంగా అందరూ భావిస్తున్న అమెరికాలో అనేకమంది బాలల పరిస్థితి దయనీయంగా ఉందనే వాస్తవాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. దేశంలోని సుమారు 50 శాతం మంది పిల్లలు ప్రమాదకరమైన రీతిలో దారిద్య్ర రేఖకు సమీపంలో జీవిస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. అనేక మంది పిల్లలు అత్యంత ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి కూడా చాలీచాలని ఆదాయం ఉన్న కుటుంబాలలో జీవిస్తున్నారని కొలంబియా విశ్వవిద్యాలయంలోని నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ ఇన్ పావర్టీ (ఎన్‌సిసిపి)కి చెందిన పరిశోధకులు రూపొందించిన నివేదిక వివరించింది. దేశవ్యాప్తంగా 31 మిలియన్ల మందికిపైగా పిల్లలు తీవ్రమైన ఆర్థిక అస్థిరత్వం, పేదరికాన్ని ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక వివరించింది. పోషకాహార, ఆరోగ్య బీమా కార్యక్రమాలను విస్తరించినప్పటికీ అవి అత్యంత అవసరమైన అనేకమంది పిల్లలకు ఇంకా చేరాల్సి ఉందని ఎన్‌సిసిపికి చెందిన రెనీ విల్సన్ సిమ్మన్స్ తెలిపారు. మన స్వల్ప వృద్ధి, స్వల్ప వేతన ఆర్థిక వ్యవస్థలో అనేక కుటుంబాలలో జీవిస్తున్న మిలియన్ల కొద్ది పిల్లలు తమ అవసరాలను తీర్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని వివరించారు. ఈ తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో 2008తో పోలిస్తే 2014 నాటికి పేద పిల్లల సంఖ్య 18శాతం పెరిగింది. స్వల్పాదాయ కుటుంబాలలో జీవిస్తున్న పిల్లల సంఖ్య ఈ కాలంలో పది శాతం పెరిగింది. 2014లో 18 సంవత్సరాలలోపు వయసు గల 44 శాతం (31.4 మిలియన్ల) మంది పిల్లలు స్వల్పాదాయ కుటుంబాలలో నివసించగా, 21 శాతం (15.4 మిలియన్ల) మంది పిల్లలు పేద కుటుంబాలలో నివసించారని ఈ నివేదిక వివరించింది. పెద్దలకన్నా ఎక్కువగా పిల్లలు పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొంది. అల్పాదాయ వర్గాల కుటుంబాలలో 44 శాతం మంది పిల్లలు నివసిస్తుండగా, కేవలం 18-64 సంవత్సరాల మధ్య వయసు గల పెద్దలు ఈ కుటుంబాలలో నివసిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది.