జాతీయ వార్తలు

పిఎ సంగ్మా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా హఠాన్మరణం చెందారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవి నిర్వహించిన 68 ఏళ్ల సంగ్మా శుక్రవారం ఉదయం ఇక్కడ గుండెపోటుతో మృతి చెందారు. మేఘాలయలోని తుర నియోజకవర్గం నుంచి ఆయన తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత 16వ లోక్‌సభలో సభ్యుడైన సంగ్మా ఆకస్మిక మృతి వార్తను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం సభకు తెలియజేశారు. మహాజన్ నేతృత్వంలో లోక్‌సభ సంగ్మాకు శ్రద్ధాంజలి ఘటించింది. సంగ్మాకు భార్య సొరోదిని, ఇద్దరు కుమారులు కొన్‌రాడ్, జేమ్స్, ఒక కుమార్తె అగత ఉన్నారు. కొన్‌రాడ్ గతంలో మేఘాలయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జేమ్స్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అగత 2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 11వ లోక్‌సభలో బిజెపి నేత వాజపేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినపుడు, ఆ పార్టీకి లోక్‌సభలో తగినంత బలంలేని కారణంగా కాంగ్రెస్ నేత అయిన సంగ్మానే లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకోవడానికి అంగీకరించింది. ఈ ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొనసాగింది.
సుదీర్ఘ రాజకీయ జీవితం గల సంగ్మా అనేక ఏళ్లపాటు కాంగ్రెస్‌లో కొనసాగినా, తరువాత ఆ పార్టీ నుంచి బయటకువచ్చి ఎన్‌సిపి వ్యవస్థాపకుల్లో ఒకరిగా నిలిచారు.