జాతీయ వార్తలు

మోగిన ఎన్నికల నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పాండిచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైది శుక్రవారం మీడియా సమావేశంలో షెడ్యూలు ప్రకటించారు. పోలింగ్ మొత్తం ఏప్రిల్ 6 నుంచి మే 16వరకు ఏడు దశల్లో నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలు మొదటి రెండు దశల్లో ఏప్రిల్ 4, 11 తేదీల్లో జరుగుతాయి. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు మే 16న ఒకే విడతలో పూర్తి చేస్తారు. ఐదు రాష్ట్రాల శాసన సభల్లోని మొత్తం 824 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 19న నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల మొత్తం ప్రక్రియ మే 21తో ముగుస్తుంది. కేరళలో 140, తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్‌లో 294, పాండిచ్చేరిలో 30, అసోంలో 126 స్థానాలు ఉండగా, ఐదు రాష్ట్రాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 1070 మిలియన్లని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు.
సిఎం తరుణ్ గొగోయ్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోవున్న అసోంలో మొదటి దశగా ఏప్రిల్ 4న 65 స్థానాలకు, రెండోదశగా 11న 61 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారంలోవున్న పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్‌లో మొదటి రెండు దశల పోలింగ్ ఏప్రిల్ 4, 11న నిర్వహిస్తారు. మరో ఐదు దశల పోలింగ్‌ను ఏప్రిల్ 17, 21, 25, 30, మే 5న నిర్వహిస్తారు. కాంగ్రెస్ అధికారంలోవున్న కేరళ, జయలలిత అధికారంలో వున్న తమిళనాడు సహా పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే16న ఒకే దశలో పూర్తి చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జైదీ ప్రకటించారు.
అసోం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 11న విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ మార్చి 18. 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21వరకూ ఉపసంహరణకు గడువు. ఏప్రిల్ 4, 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఏడు దశల్లో నిర్వహించనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను మార్చి 11, 14, 22, 28, ఏప్రిల్ 1, 4, 11 తేదీల్లో విడుదల చేస్తారు. మొదటి దశ ఏప్రిల్4న, రెండో దశ 11న, మూడో 17న, నాలుగో దశ 21న, ఐదోదశ 25న, ఆరోదశ 30న, ఏడోదశ పోలింగ్ మే 5న నిర్వహిస్తారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదలవుతుంది. 29 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు, 30న పరిశీలన, మే 2లోగా ఉపసంహరణకు గడువు. ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ మే 16న జరుగుతుంది. అసోంలో 24వేల 888, కేరళలో 21వేల 498, తమిళనాడులో 65వేల 616, పశ్చిమ బెంగాల్‌లో 77వేల 247, పాండిచ్చేరిలో 913 పోలింగ్ స్టేషన్లు కలిపి ఐదు రాష్ట్రాల్లో మొత్తం లక్షా 90 వేల 162 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.