జాతీయ వార్తలు

ఎగుడు దిగుడుల రాజకీయ ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలనుంచి తొలిసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయిన పిఏ సంగ్మా రాజకీయ జీవన ప్రస్థనమంతా కూడా ఎగుడు దిగుడుల మయమే.
మొదట సోనియా గాంధీ విదేశీయత అంశంపై ఆమెను వ్యతిరేకించి, ఆ తర్వాత యుపిఏలో భాగస్వామిగా ఆమెతోనే చేతులు కలిపిన ఆయన చివరికి యుపిఏ రాష్టప్రతి అభ్యర్థి అయిన ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా బిజెపి అభ్యర్థిగా పోటీకి దిగడం గమనార్హం. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్న 68 ఏళ్ల సంగ్మా రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత పీవీ నరసింహారావు మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా కూడా ఉన్నారు. 1996లో అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది కాలం ఉండిన బిజెపి ప్రభుత్వంలో అన్ని పార్టీల మద్దతుతో సంగ్మా లోక్‌సభ స్పీకర్ అయ్యారు.
సోనియా గాంధీ విదేశీయత అంశంపై ఆమెపై తిరుగుబాటు బావుటా ఎగరేసినందుకు 199 మే 20న కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, అన్వర్ తారిఖ్‌లతో పాటుగా సంగ్మాను పార్టీనుంచి బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన పవార్, తారిఖ్‌లతో కలిసి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)ను ఏర్పాటు చేశారు. 2004లో సంగ్మా ఎన్‌సిపిని చీల్చాక తన వర్గాన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో విలీనం చేసి నేషనలిస్ట్ తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. రాష్టప్రతి ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని శరద్ పవార్ వ్యతిరేకించడంతో 2012 జూన్ 20న ఆయన యుపిఏ కూటమినుంచి వైదొలిగారు. ఆ మర్నాడే బిజెపి ఆయనను రాష్టప్రతి ఎన్నికల్లో తమ పార్టీ అధికార అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆయన ప్రణబ్ చేతిలో ఓడిపోయారు. 11వ లోక్‌సభ స్పీకర్‌గా సంగ్మా సహజసిద్ధమైన తన హాస్య ధోరణితో, స్నేహపూర్వక ప్రవర్తన, నిష్పాక్షికతతో గొడవ చేసే ప్రతిపక్ష సభ్యులను అదుపు జేసే వారు.
మేఘాలయలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన సంగ్మా 30 ఏళ్ల వయసులోనే తురా నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రానంతరం తొలిసారి కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో దేశంలో రాజకీయ వాతావరణం తీవ్ర గందరగోళంగా ఉన్న తరుణంలో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నిక కావడం గమనార్హం. రెండేళ్ల లోపే జనతా పార్టీ అధికారం కోల్పోగా, ఆ తర్వాత చరణ్ సింగ్ ప్రభుత్వం కొద్ది నెలలు మాత్రమే కొనసాగింది. తర్వాత 1980లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగా సంగ్మా అదే నియోజకవర్గంనుంచి తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు.