అంతర్జాతీయం

పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఓ వైపు భారత్, అమెరికా ప్రజా ప్రతినిధులు తీవ్ర వ్యతిరేకతల నడుమ అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి అధికారిక ఫెడరల్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత విక్రయం దక్షిణాసియాలో ఒక వ్యూహాత్మక భాగస్వామి (పాకిస్తాన్) భద్రతను మెరుగుపర్చడం ద్వారా అమెరికా విదేశాంగ విధానం లక్ష్యాలను, దేశ భద్రత లక్ష్యాలను నెరవేర్చడానికి దోహదపడుతుంది’ అని గత నెల 11న అమెరికా రక్షణ సెక్యూరిటీ సహకార ఏజన్సీ ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రియాన్‌కు రాసిన లేఖ కాపీతో పాటుగా శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్ ప్రచురించిన ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ ఎఫ్-16 విమానాల మొత్తం ఖరీదు దాదాపు 70 కోట్ల డాలర్లు ఉండవచ్చని కూడా ఆ నోటిఫికేషన్ పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విమానాల విక్రయంకోసం అభ్యర్థించిందని, అయితే ఇలాంటి ఆయుధాల బదిలీలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తోడ్పడుతుందన్న అమెరికా వాదనతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంటూ భారత్ పాకిస్తాన్‌కు ఈ విమానాలను విక్రయించడాన్ని వ్యతిరేకించిందని కూడా ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు ఎఫ్-16ల విక్రయాన్ని వ్యతిరేకించడంలో తనతో చేతులు కలపాలని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ రాండ్ పౌల్ సెనేట్‌లోని తన సహచరులను కోరారు.
పాకిస్తాన్ మొదట 18 ఎఫ్-16 విమానాలను విక్రయించాలని కోరిందని, అయితే ఆర్థకపరమైన చిక్కుల కారణంగా ఎనిమిది విమానాలను మాత్రమే కొనుగోలు చేస్తోందని పాక్ ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తార్ అజీజ్ ఈ వారం రక్షణ వ్యవహారాల రచయితల గ్రూపుతో అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులో ఈ యుద్ధ విమానాలు అత్యంత కీలకమైనవని కూడా అజీజ్ చెప్పారు. ఈ విమానాలు తమ యుద్ధ విమానాలలో భాగంగా ఉంటాయని, అయితే గత రెండు మూడేళ్లుగా ఇలాంటి విమానాలను గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించడం జరిగిందని చెప్పారు.
పాకిస్తాన్‌కు సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కూడా ఈ విక్రయంలో భాగంగా ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో తెలియజేశారు.