జాతీయ వార్తలు

నటుడు కళాభవన్ మణి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై:నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, మిమిక్రీ కళాకారుడు ‘కళాభవన్’ మణి కన్నుమూశారు. ఆయ న వయస్సు 45 సంవత్సరాలు. ‘జెమిని’ చిత్రంలో విలన్‌గా వినూత్నరీతిలో నటిం చి తెలుగువారికి పరిచయమైన మణి తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఆటోడ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి, అదే పాత్రతో సినిమాల్లోకి అరంగేట్రం చేసి జాతీయస్థాయి నటుడిగా ఎదిగిన మణి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన భార్య నిమ్మి వెటర్నరీ వైద్యురాలు. వారికి ఒక కుమార్తె. కొద్దిరోజులుగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మణి కోచిలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
కేరళలోని చాలకూడిలో పుట్టిన మణి ప్రఖ్యాత ‘కళాభవన్’లో మిమిక్రీ కళాకారుడిగా జీవితాన్ని ప్రారంభించి గాయకుడిగా మారారు. జానపద పాటలు పాడటంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. వందలాది ఆల్బమ్‌లను రూపొందించి మంచిపేరు తెచ్చుకున్నారు. ‘అక్షరమ్’ అనే సినిమాలో ఆటోరిక్షా డ్రైవర్ పాత్రలో నటించడంద్వారా సినిమాల్లోకి వచ్చాడు. మొదట కమెడియన్‌గా నటించినా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో రాణించారు. రంగస్థల నటుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపిన మణి తెలుగులో వెంకటేష్‌తో ‘జెమిని’, మహేష్‌బాబుతో ‘అర్జున్’, రాజశేఖర్‌తో ‘ఎవడైతే నాకేంటి’ సినిమాల్లో విలన్‌గా నటించారు. మలయాళంలో ఆయన నటించిన ‘వసంతియుం లక్ష్మియుం పినె్న ఎంజానుమ్’ చిత్రంలో నటనకుగాను 2000 సంవత్సరంలో జాతీయస్థాయి నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. అదే సినిమాకు ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్రప్రభుత్వ అవార్డు దక్కింది. కష్టాల్లో ఉన్నవారిని అన్నివిధాలా ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మణి అంటే తెలియనివారు కేరళలో లేరనడం అతిశయోక్తికాదు. త్వరలో జరగబోయే కేరళ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయాలని మణిని ‘ఎల్‌డిఎఫ్’ ఆహ్వానించింది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.