జాతీయ వార్తలు

అయినా.. లక్ష్యం మారలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: వారంతా యాసిడ్ బాధిత యువతులు... ప్రేమను అంగీకరించలేదనో, పెద్దలమీద కోపంతోనో, ఈర్ష్యాద్వేషాలతోనో... కారణం ఏదైతేనేం వారంతా ప్రత్యక్ష నరకం అనుభవించారు. యాసిడ్ పోసిన ఉన్మాదులు వారిని శారీరకంగా హింసించారేమో కానీ, జీవితంపై వారి లక్ష్యాన్ని మార్చలేకపోయారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొని, అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి తమ కాళ్లపై నిలబడ్డారు. యాసిడ్ దాడికి గురైన 40మంది యువతులను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వారిని ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ సహకారం, ఎన్జీఓల చొరవతో వీరంతా ఉపాధి బాట పట్టి జీవితంపై ఆశ పెంచుకున్నారు. మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. క్షణికావేశంలో, సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ దాడులతో శారీరక వైకల్యాన్ని అనుభవించినా, వారు చూపిన మానసిక స్థైర్యం ఆదర్శనీయం. సన్మానం సందర్భంగా వారు అనుభవించిన ప్రత్యక్ష నరకాన్ని వివరిస్తుంటే కళ్లు చెమర్చాల్సిందే. ‘ప్రభుత్వ సహకారంతో అందుతున్న చికిత్సను కొనసాగిస్తాను. నా కాళ్లపై నేను నిలబడి, నాలాంటి సహాయం చేయాలన్నదే నా లక్ష్యం’ అంటున్న మీరట్‌కు చెందిన రంజిత (18) స్థైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. తన తండ్రిమీద కోపంతో బిజ్నోర్‌కు చెందిన అంశుపై 55 ఏళ్ల వ్యక్తి యాసిడ్ దాడి జరిపాడు. ఈ దాడిలో ఒక కన్ను పూర్తిగా దెబ్బతినగా, మరొకటి పాక్షికంగా దెబ్బతింది. ‘నా ముఖం వికృతంగా మారినా, నన్ను చూడటానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా నేనేమీ బాధపడను. నా చదువును కొనసాగిస్తాను’ అంటోంది అంశు. యాసిడ్ దాడి బాధితుల ఉపాధి కోసం ‘షీరోస్ హాంగవుట్’ పేరుతో ఓ ప్రత్యేక సెంటర్‌ను ప్రారంభించారు.

యాసిడ్ బాధిత మహిళలకు మంగళవారం లక్నోలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్