అంతర్జాతీయం

భారతీయ విద్యార్థులు అమెరికాలోనే ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయులను దేశంనుంచి పంపించి వేయాల్సిన అవసరం లేదని, ఎందుకంటే దేశానికి అలాంటి తెలివైన వాళ్లు కావాలని అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో అందరికన్నా ముందున్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా వర్కర్లకు ఉపాధి లేకుండా చేస్తున్న హెచ్-1బి వీసా విధానాన్ని రద్దు చేయాలంటూ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ‘మనం ఇష్టపడినా లేకపోయినా వాళ్లు ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే మనం చాలా మందిని.. చాలా తెలివైన వారిని విద్యావంతులను చేస్తున్నాం. దేశంలో మనకు అలాంటి వాళ్లు కావాలి’ అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చట్టబద్ధమైన వలసలపై మీ అభిప్రాయమేమిటని అడిగినప్పుడు ట్రంప్ చెప్పారు. ‘వాళ్లు అమెరికా రావడం లేదు. హార్వర్డ్ యూనివర్శిటీకి వెళ్తారు. వాళ్లంతా తమ క్లాసులో ఫస్ట్‌క్లాస్ విద్యార్థులు. అంతేకాదు వాళ్లంతా భారత్‌నుంచి వచ్చినవాళ్లు కాబట్టి చదువు పూర్తయిన తర్వాత వాళ్లు స్వదేశం తిరిగివెళ్తారు. కంపెనీలు పెడ్తారు, బోలెడంత సంపాదిస్తారు. అలాగే బోలెడంత మందిని ఉద్యోగులుగా తీసుకుంటారు. అంతటితో సరి’ అని ఆయన అన్నారు. వాళ్లలో చాలామంది ఈ దేశంలోనే ఉండిపోయి అదే పని చేయాలనుకుంటారు. ఈ దేశంలో చాలా ఏళ్లు కాలేజీలో గడిపి, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రోజే బయటికి పంపించి వేయాలనుకోవడం సరికాదని భావిస్తున్నానని, హెచ్-1బి వీసాలకు సంబంధించి కొన్ని అంశాలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ ట్రంప్ అన్నారు. అమెరికా వర్కర్లకు అన్యాయం చేస్తున్న వారి ఉద్యోగాలను లాక్కుంటున్న హెచ్-1బి వీసా పథకాన్ని రద్దు చేయాలని ట్రంప్ తన ప్రచారం ప్రారంభమైన మొదటినుంచీ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగ వీసాలపై ఇతర దేశాలనుంచి వచ్చిన వారు అమెరికాలో దాదాపు కోటీ పది లక్షల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్ లాంటి దేశాలనుంచి వచ్చిన ఐటి ఉద్యోగులే.