జాతీయ వార్తలు

వర్శిటీలు స్ఫూర్తికి నిలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విద్యా సంస్థల్లో దేశభక్తి, సహనశీలత వంటి ఉన్నత భావనలను బలంగా పాదుగొల్పాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. కొన్ని యూనివర్సిటీల్లో జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న వివాదాల నేపథ్యంలో రాష్టప్రతి ఇచ్చిన పిలుపునకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. విద్యార్థుల్లో నిజాయితీ, మహిళల పట్ల గౌరవ భావనలను పెంపొందించాల్సిన అగత్యం కూడా ఎంతో ఉందని రాష్టప్రతి ఉద్ఘాటించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీలకు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఉత్తమ వర్సిటీలుగా గుర్తింపు లభించిన సందర్భగా జరిగిన కార్యక్రమంలో రాష్టప్రతి మాట్లాడారు. అత్యున్నతమైన విద్యా సంస్థగా రాణించాలంటే ఏ సంస్థయినా కొన్ని వౌలిక నిబంధనలను కట్టుబడి ఉండాల్సి ఉంటుందని, వీటన్నింటిలో అత్యంత కీలకమైనది బోధనా నాణ్యత, పరిశోధనేనని రాష్టప్రతి తెలిపారు. అలాగే బోధనాపరమైన ప్రమాణాలను పెంపొందించడం దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు సంధానతనకు పెంపొందించుకోవడం కూడా ఒక విద్యా సంస్థ ఉన్నతా స్థాయికి చేరుకోవడానికి దోహదం చేస్తుందని రాష్టప్రతి వెల్లడించారు. విద్యాపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఉద్ఘాటిస్తూనే దేశభక్తి, సహనశీలత, నిజాయితీ, విద్యుక్త ధర్మ నిర్వహణ మొదలైన నాగరిక విలువలను కూడా ప్రతి సంస్థా బలంగా పాదుగొల్పాలని తెలిపారు. తాజాగా ప్రధానం చేసిన అవార్డులు వర్సిటీల్లో మరింతగా పరిశోధనాసక్తికి పెంపొందించడానికి ఉత్రేరకం కావాలని రాష్టప్రతి తెలిపారు. విద్యా సంస్థలన్నీ విజ్ఞాన, బోధనాలయాలుగా మారాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు.
రాష్టప్రతిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత తాను దాదాపు వందకుపైగా కేంద్రీయ విద్యా సంస్థలకు విజిటర్‌గా మారానని వెల్లడించారు. ఈ విజిటర్ భూమికను రాష్టప్రతి ఏ విధంగా పోషించాలనే విషయాన్ని తెలుసుకోవడానికి తనకు కొంత వ్యవధి పట్టిందని, అదే క్రమంలో దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ స్థితిగతులను కూడా పరిశీలించగలిగానన్నారు. ఇప్పటివరకూ తాను చేసిన ప్రయత్నం ఫలితాలను ఇవ్వడం మొదలైందని, రెండు భారతీయ యూనివర్సిటీలు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించగలిగాయని తెలిపారు.