జాతీయ వార్తలు

భగ్గుమన్న పెట్రో ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిలు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 3 రూపాయల 7 పైసలు, డీజిలు ధర రూపాయి 90 పైసలు పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ప్రకటించాయి. రాష్ట్ర సుంకాలతో కలుపుకొని కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రినుంచి అమలులోకి వస్తాయని దేశంలో అతి పెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ పెరుగుదల తర్వాత పెట్రోలు ధర ఢిల్లీలో లీటరుకు రూ.59.68, కోల్‌కతాలో రూ.63.76, ముంబయిలో రూ. 65.79, చెన్నైలో రూ. 59.13 అవుతుందని ఆ సంస్థ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిలు ధరలు, అలాగే డాలరుతో రూపాయి మారకం రేటులో మార్పుల కారణంగా పెట్రోలు, డీజిలు ధరలను పెంచాల్సి వచ్చిందని ఐఓసి ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల 29న పెట్రోలు ధర 3 రూపాయల 2 పైసలు తగ్గించిన తర్వాత ఇప్పుడు పెట్రోలు ధర పెంచడం గమనార్హం. కాగా, వరసగా ఏడుసార్లు తగ్గిన తర్వాత పెట్రోలు ధరలు పెరగడం ఇదే మొదటిసారి. అయితే డీజిల్ ధరల పెరగడం మాత్రం వరసగా ఇది మూడోసారి. గత నెల 29న కూడా డీజిలు ధర లీటరుకు రూ.1.47 పెరిగింది.