అంతర్జాతీయం

టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ప్రపంచ ప్రఖ్యాత మైనం ప్రతిమల మ్యూజియం అయిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని వివిధ రంగాలకు చెందిన ప్రపంచ ప్రముఖుల విగ్రహాల సరసన ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహానికి కూడా చోటు లభించబోతోంది. వచ్చే నెల లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మోదీ మైనపు ప్రతిమలను ఏర్పాటు చేయబోతున్నట్లు బుధవారం మ్యూజియం ప్రకటించింది. మోదీని ప్రపంచ రాజకీయాల్లో గొప్ప ప్రముఖ వ్యక్తిగా అభివర్ణించిన మ్యూజియం విగ్రహాన్ని రూపొందించడానికి ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధాని తన నివాసంలో మ్యూజియం కళాకారులు, నిపుణుల బృందానికి ఒక సిట్టింగ్ ఇచ్చినట్లు తెలియజేసింది. ‘మేడమ్ టుస్సాడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రముఖులైన వారి విగ్రహాలను రూపొందించింది. అలాంటి వారి సరసన ఉండడానికి నేను ఎలా అర్హుడినని అనుకుంటాను. అయితే ప్రజాభిప్రాయం, ప్రజల మనోభావాలను బట్టి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీరు నాకు తెలియజేసినప్పుడు నేను కాదనలేక పోయాను’ అని మోదీ మ్యూజియంకు పంపిన ఓ ప్రకటనలో అన్నారు. సిట్టింగ్ సందర్భంగా మ్యూజియం బృందాన్ని చాలా జాగ్రత్తగా గమనించానని, వారి అంకిత భావం, ప్రొఫెషనలిజం, నైపుణ్యం చూసి ముగ్ధుడ్ని అయ్యానని కూడా మోదీ అన్నారు. తాను మూడు నాలుగుసార్లు మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలను సందర్శించానని, వివిధ ప్రముఖుల విగ్రహాల పక్కన నిలబడి ఫోటోలు కూడా దిగానని ఆయన తెలిపారు.
ఐరోపా, ఆసియాలలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో ఏర్పాటు చేయబోయే మోదీ విగ్రహాలన్నీ కూడా మీగడ రంగులో ఉండే మోదీ ‘సిగ్నేచర్ కుర్తా’, జాకెట్ ధరించి ఉండడమే కాకుండా భారతీయ సంప్రదాయమైన నమస్కారం పెడుతున్నట్లుగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ ప్రపంచ రాజకీయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి అని, టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 2015 సంవత్సరపు టాప్-10 ప్రపంచ ప్రముఖుల్లో స్థానం లభించడమే దీనికి నిదర్శనమని మ్యూజియం ప్రతినిధి కీరన్ లాన్సిని పేర్కొన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆయనకున్న గొప్పస్థానం కూడా ఆయన పట్ల ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో ధ్రువీకరిస్తోందని, తాము అభిప్రాయం కోరిన అతిథుల అభిప్రాయం కూడా దీన్ని బలపరచడమే యన విగ్రహాన్ని రూపొందించేలా చేసిందని ఆయన అన్నారు. లండన్, సింగపూర్, హాంకాంగ్, సింగపూర్‌లలోని మ్యూజియంలలోని ప్రముఖుల కలెక్షన్‌లో మోదీ విగ్రహాన్ని కూడా చేర్చడానికి తామెంతో సంతోషిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో విగ్రహాన్ని రూపొందించడానికి మ్యూజియం బృందానికి నాలుగు నెలల సమయం పట్టిందని, దాదాపు లక్షా 50 వేల పౌండ్లు ఖర్చయిందని తెలుస్తోంది. మ్యూజియంను సందర్శించే అతిథులు మోదీ విగ్రహం పక్కన భుజం భుజం కలిపి నిలుచోవచ్చని, అంతేకాకుండా సెల్ఫీకూడా తీసుకోవచ్చని మ్యూజియం తెలియజేసింది. లండన్‌సహా మిగతా మ్యూజియంలలో మోదీ విగ్రహావిష్కరణ ఏప్రిల్ నెల చివర్లో ఉంటుందని, ఈ నాలుగుచోట్లలో ఏదో ఒకచోట మోదీ స్వయంగా తన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారా అనే విషయం ఇంకా ధ్రువీకరణ కాలేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది భారత్-బ్రిటన్ సాంస్కృతిక సంవత్సరంలో భాగంగా న్యూఢిల్లీలో కూడా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం శాఖ ప్రారంభం అవుతుందని గత నవంబర్‌లో ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా మ్యూజియం ప్రకటించింది.

టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాల ఏర్పాటు నిమిత్తం ప్రధాని మోదీ నుంచి కొలతలు తీసుకుంటున్న మ్యూజియం ప్రతినిధులు