జాతీయ వార్తలు

ఏపిని నిర్లక్ష్యం చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: బిజెపి రాజకీయ అజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రధమస్థానంలో ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసే ప్రసక్తిలేదని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావుస్పస్టం చేశారు. టిడిపితో పొత్తు యథాతధంగా కొనసాగుతుందని చెబుతూ తెలంగాణలో మాత్రం ఎవరితోనూ పొత్తులేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని శుక్రవారం ఇక్కడ విలేఖరులతో చెప్పారు. ఏపిలో కొందరు బిజెపి నేతలు ముఖ్యంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేస్తున్న విమర్శల వల్ల సంబంధాలు బెడిసి కొట్టే అవకాశాలు లేవా? అన్న ప్రశ్నకు ‘రెండు శిబిరాలకు చెందిన కొంతమంది వ్యక్తులు సంయమనం కోల్పోయి ప్రకటనలు చేస్తున్నారు’అని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రకటన వల్ల ఎలాంటి నష్టం ఉండదని ఆయన చెప్పారు. తమ పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించదని ఆయన అన్నారు. ఏపిలో బిజెపికి బలమైన నాయకత్వం లేదు, విభజన తరువాత ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తామన్న ప్రకటన ఇంతవరకూ అమలు చేయలేనందున అక్కడి ప్రజలు పార్టీని విశ్వసిస్తారా? అన్న ప్రశ్నకు ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు మించిన ప్రయోజనాలు లభించబోతున్నాయి’అని బదులిచ్చారు. అమరావతి శంకుస్థాపనలో ప్రధాని మోదీ ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ప్రజలు నిరాశతో ఉన్నారని ఆయన దృష్టికి తీసుకురాగా, ప్రధాని మోదీ ప్రతి ఒక్క విషయంలో ఏపికి న్యాయం చేస్తారని మురళీధరరావుభరోసా ఇచ్చారు.
నాలుగు రాష్ట్రాల విధానసభ ఎన్నికల తతంగం ముగిసిన తరువాత ఆంధ్ర, తెలంగాణలో పార్టీ పటిష్టానికి తమ అధినాయకత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించి అమలుచేస్తుందని వెల్లడించారు. బిహార్ విధానసభ ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన బిజెపికి రాజకీయంగా దెబ్బతగిలినట్లు భావించనక్కర్లేదని ఆయన తెలిపారు. ఓటమికి దారి తీసిన పరిస్థితులపై సమగ్రంగా చర్చించి పార్టీని బలోపేతం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.