అంతర్జాతీయం

ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ నుంచి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల చికాగోలో ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన ఆందోళనకారులు తాజాగా న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించడంతో పాటు అరిజోనా రాష్ట్ర నైరుతి ప్రాంతంలోని ఒక ప్రధాన రహదారిని దిగ్బంధించి ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వందలాది మంది ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, ట్రంప్ మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు కొంత మందిని అరెస్టుచేసి తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ట్రంప్ సొంత ప్రాంతమైన న్యూయార్క్‌లో కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. మన్‌హట్టన్ కొలంబస్ సర్కిల్‌కు సమీపంలో ట్రంప్‌కు చెందిన ఒక విలాసవంతమైన భవనం వద్ద వందలాది మంది ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రజలతోపాటు సామాజిక కార్యకర్తలకు చెందిన గ్రూపులు, వలసదారుల హక్కులను కాపాడే సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్ గో అవే, రేసిస్ట్, సెక్సిస్ట్’ అంటూ ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.

chitram...
న్యూయార్క్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళన