జాతీయ వార్తలు

అస్సాంలో హంగ్ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అస్సాం అసెం బ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ దక్కదని, హంగ్ అసెంబ్లీ ఏర్పాడే సూ చనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ పల్స్ సంస్థ అస్సాంలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపిన సర్వేలో హంగ్ తప్పదని తేలింది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎంపిక చేసిన 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్వే జరిపింది. సర్వే జరిపిన 19 నియోజకవర్గాల్లో 15 సాధారణ నియోజకవర్గాలు, మూడు ఎస్‌టి రిజర్వుడ్ నియోజకవర్గాలు, ఒకటి ఎస్‌సి రిజర్వుడ్ నియోజకవర్గం ఉన్నాయి. ఐదు పోలింగ్ కేంద్రాల్లోని దాదాపు 30 మంది అభిప్రాయాల ఆధారంగా సర్వే నివేదిక తయారైంది. గౌహారీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తి కరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి నల్లేరుపై నడక అవుతుందనే అంచనాలన్నీ తల్లకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఘోరంగా ఓడిపోతుందనుకున్న కాంగ్రెస్ నిలదొక్కుకోవటంతోపాటు బిజెపికి గట్టి పోటీని ఇస్తోంది. అస్సాం ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఒక రకంగా వ్యవహరిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారని సర్వే అంచనా వేస్తోంది. అస్సాం ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లాగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచిస్తే బిజెపి పెద్ద మెజారిటీతో ఖాయమయ్యేది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలనుకుంటున్నట్టు సర్వే సూచిస్తోంది. పీపుల్స్ సర్వే అంచనాల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు లభిస్తే బిజెపి దాని మిత్రపక్షాలకు దాదాపు 38 శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య ఏడు శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి తరుణ్‌గగోయ్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దాదాపు 40 శాతం మంది కోరుకుంటే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్ధి సర్బానంద్ సోనోవాల్‌ను 33 శాతం మంది సమర్థించారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలే బిజెపిలో చేరిన హేమంత్ బిస్వాస్ శర్మకు కేవలం 8. 9 శాతం ఓట్లు పడ్డాయి. తనను తాను కింగ్ మేకర్ అని భావిస్తున్న ఏఐయుడిఎఫ్ నాయకుడు, బద్రుద్దీన్ అజ్మల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కేవలం 5. 4 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నట్లు సర్వే చెబుతోంది. అస్సాంకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఏజిపి నాయకుడు ప్రఫుల్లకుమార్ మెహంతాను ముఖ్యమంత్రి పదవికి కేవలం 3. 8 శాతం మంది మాత్రమే కోరుకోవటం గమనార్హం.
రాష్ట్రంలో వరుసగా నాలుగో సారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పని తీరు బాగుందని 33.2 శాతం మంది చెబితే 40 శాతం మంది మాత్రం ఒక మోస్తరు అని అభిప్రాయపడ్డారు. 26.4 శాతం మంది మాత్రం గొగోయ్ పరిపాలన బాగా లేదని చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించటం, బిపిల్ రాజకీయాలు, అభివృద్ధి తరుణ్ గొగోయ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. రాష్ట్భ్రావృద్ధికి ఏ రాజకీయ పార్టీ మంచిదనే ప్రశ్నకు కాగ్రెస్ బెటరని 43.6 శాతం మంది చెబితే బిజెపి మంచిదని 33.7 శాతం మంది బదులిచ్చారు. రాష్ట్ర ప్రజలు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగంతో విసిగివేసారిపోయి ఉన్నారు. ఈ మూడు సమస్యలను పరిష్కరించేందుకు ఏ పార్టీ సమర్థ విధానాలను ప్రకటిస్తోందో ఆ పార్టీకి ఓటు వేస్తామని పలువురు తెలిపారు. అస్సాంలోకి వలస వస్తున్న వారు పెద్ద సమస్య అని 52 శాతం మంది చెబితే 23 శాతం మంది మాత్రం ఈ వలసలను గోరంతను కొండంత చేసి చూపిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోకి వలస వచ్చిన వారందరిని పంపించివేస్తామని హామీ ఇచ్చినందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు బిజెపికి పట్టం కట్టారు. అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో నుంచి ఏడు సీట్లలో బిజెపిని గెలిపించారు. అయితే నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత ఈ హామీని మరిచిపోయారని అస్సాం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఓటర్లు ఈ సారి బిజెపి హామీలు విశ్వసించటం లేదనే మాట వినిపిస్తోందని సర్వే చెబుతోంది. దీనికితోడు బిజెపికి రాష్ట్రంలో సంస్థాగతపరమైన వ్యవస్థ లేకపోవటం వల్ల నష్టం కలుగుతోంది. ఇక బిజెపి మిత్రపక్షమైన ఏజిపికి గ్రామ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ ఉంది.
బిజెపి అధినాయకత్వం ఈ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఏజిపి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్‌కు మాత్రం గ్రామ స్థాయి వరకు మంచి పార్టీ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోగలిగితే కాంగ్రెస్‌కు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నది.