తెలంగాణ

టి.సర్కార్‌కు మోదీ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి : తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, సత్సంబంధాలతో పనులు సాధించుకోవడంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉందని సిఎస్ రాజీవ్ శర్మను ప్రధాన మంత్రి మోదీ అభినందించారు. ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 12 అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని సమీక్షించారు. అటవీ, పర్యావరణ, రైల్వే తదితర వాటికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు సాధించడానికి తెలంగాణ రాష్ట్ర అధికారులు చక్కటి సమన్వయంతో వ్యవహరిస్తున్నారని ప్రధాని అభినందించారు. ముఖ్యంగా వాల్టా చట్టం (వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్), కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం పనితీరు బాగుందని ప్రధాని మెచ్చుకున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అంశాన్ని రాజీవ్ శర్మ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందిస్తూ త్వరగా పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఖర్చు పెడుతున్న ఏ ఒక్క రూపాయి కూడా అనర్హులకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ప్రధాన మంత్రి సూచించారు.