జాతీయ వార్తలు

కేంద్ర సిబ్బందికి డిఏ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం హోలీ పండుగను పురస్కరించుకుని బుధవారం తమ ఉద్యోగులకు కరవుభత్యాన్ని 6 శాతం పెంచింది. దీనివల్ల దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాది జనవరి 1నుంచి అమలులోకి వచ్చే డిఏ పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏటా రూ. 6,795.24కోట్లు, పెన్షనర్లకు సంబంధించి రూ. 7,929. 24 కోట్ల భారం పడుతుందని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేఖరులకు చెప్పారు. ఈ డిఏ పెంపు వల్ల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 58 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెంపుతో కరవు భత్యం వారి మూల వేతనంలో ఇప్పుడున్న 119 శాతంనుంచి 125 శాతానికి పెరుగుతుంది.